భారాస పార్టీకి ఖమ్మం సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. భారాస నుంచి పోటీ అవకాశం రాకపోవడంతో కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతుంది. శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన రాజీనామా లేఖను పంపించారు.
ఇన్నాళ్లు BRS లో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రాజీనామా లేఖ రాసిన తుమ్మల రేపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు సమాచారం. అయితే పాలేరు కాంగ్రెస్ సీటుపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది.