మన ఈనాడు:మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా. ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇక ఈ సినిమా పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. మహేష్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించనున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు మాస్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోనున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇక గుంటూరు కారం సినిమాను జనవరి 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుక గా తీసుకురానున్నారు. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి రెండు పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. మొదటి సాంగ్ దమ్ మాసాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సెకండ్ సాంగ్ పై విమర్శలు వచ్చాయి.