మన ఈనాడు:ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటుంది. ఈ మూవీ ఒక్క సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
మౌత్ టాక్ తో మ్యాజిక్ చేస్తోంది హనుమాన్ సినిమా. చిన్ సినిమా, చిన్న హీరో కానీ జాలు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. సినిమా అంటే ఇలా ఉండాలి అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి టాప్ సినిమాగా నిలబడి తన సత్తా చూపిస్తున్నాడు హనుమాన్. మూవీ దర్శకుడు, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని వందకు రెండొందల శాతం కరెక్ట్ అని ఫ్రూవ్ చేస్తోందీ సినిమా. సంక్రాంతి రేసులో వచ్చిన మిగిలిన సినిమాల కంటే బెటర్ గా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది.
ఈ సినిమా వచ్చిన రెండవ రోజు 12.45 కోట్లుకలెక్ట్ చేసింది. మొదటి రోజు కంటే 55 శాతం ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో కలెక్షన్స్ కూడా క్రమంగా పెరిగాయి. ఆదివారం, సోమవారం కూడా దుమ్ములేపే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 15 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే హిందీ బెల్ట్ లో ఈ మూవీ రెండోరోజుకి కలెక్షన్స్ డబుల్ అయ్యాయి. మూడో రోజు 6 కోట్లకి పైగా వసూళ్ళని దక్కించుకుందని చెబుతున్నారు.నార్త్ ఇండియాలో కూడా హనుమాన్ మూవీకి ఆదరణ పెరగడంతో థియేటర్స్ సంఖ్య కూడా పెరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా థియేటర్స్ పెరిగాయి. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబం అంతా కలిసి చూడగలిగే విధంగా హనుమాన్ సినిమా ఉండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. హనుమాన్ స్పీడ్ ఎంత వరకు కొనసాగుతుంది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది.