Pawan Kalyan OG New Poster | ఓజీ న్యూ పోస్టర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు..

ManaEnadu: Pawan Kalyan OG New Poster : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ నుంచి తాజాగా మరో పోస్టర్ రిలీజ్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టర్ ను చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. తమ హీరో లుక్ పై ఖుషీగా ఉన్నారు.

తమన్ షేర్ చేసిన పోస్టర్ లో పవన్ కల్యాణ్ కత్తి పట్టుకుని కనిపించాడు. విలన్లను నరుకుతున్న సీన్ లా ఉంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ , ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ ఫోటో స్పష్టం చేస్తోంది. ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ లో మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచింది.

ఓజీ లేటెస్ట్ పోస్టర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఈ ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని అభిమానులు హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పవర్ స్టార్ విశ్వరూపం చూస్తామంటున్నారు.
ఓజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని స్టార్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ , ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Share post:

లేటెస్ట్