రైతుల అవస్థలు ప్రభుత్వానికి పట్టడంలేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

వైసీపీ అధినేత జగన్(YS Jagan) కాసేపటి క్రితం గుంటూరు మిర్చియార్డు(Guntur Mirchi Yard)కు చేరుకున్నారు. ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న మిర్చి రైతులకు వైఎస్‌ జగన్‌ మద్దతుగా నిలిచారు. జగన్ రాక నేపథ్యంలో అక్కడకు పెద్ద సంఖ్యలో YCP నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అంబటి రాంబాబు(Ambati Rambabu), మేరుగ నాగార్జున, అప్పిరెడ్డి తదితర నేతలు జగన్‌కు స్వాగతం పలికారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఇది సభ కాదని కేవలం రైతులతో జగన్ మాట్లాడతారని వైసీపీ నేతలు చెపుతున్నారు.

ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు: జగన్

ఈ సందర్భంగా జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు సుఖంగా ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు తాము పండించిన పంటలను సైతం అమ్ముకోలేని పరిస్థితి నెలకొందన్నారు. RBK వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, తమ హయాంలో క్వింటాకు రూ.21-23 వరకు మద్దతు ధర ఇచ్చామని, కూటమి ప్రభుత్వంలో రూ.11-12 వేల వరకు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

ప్రతిపక్ష నేత వస్తున్నారని తెలిసినా పోలీసులు భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ ఒకే ప్రభుత్వం ఉండదని, రేపటి రోజున చంద్రబాబు(CM Chandrababu)కూ ఇదే పరిస్థితి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా రైతులను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా రైతులు, వైసీపీ శ్రేణులు మిర్చి యార్డుకు తరలివచ్చారు.

Related Posts

Rains: వరుణుడు ఉప్పెనై.. వీధులు ఏరులై.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం

తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన…

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *