చంద్రబాబు కొత్త విజన్ – వైసీపీ చేతికి అస్త్రం

టీటీడీ అధినేత చంద్రబాబు నూతన విజన్ ఆవిష్కరించారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ విజన్ హాట్ టాపిక్ గా మారింది. విశాఖలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ఆవిష్కరణ కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసారు. కానీ, ఆశించిన స్థాయిలో స్పందన కనిపించ లేదు. వైసీపీ నేతలు చంద్రబాబు ప్రకటించిన 2047 విజన్ పైన విమర్శలు ప్రారంభించారు.

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబు విజన్ 2047 పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. దీంతో వైసీపీ నేతలు గతంలో విజన్ 2020 పేరుతో ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర.. విభజిత ఏపీ సీఎంగా పాలించిన సమయంలో తీసుకున్న నిర్ణయాలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దాదాపు 54 పరిశ్రమలను అమ్మేశారని..అది కూడా తన అనుచరులు, తన బినామీలకు పావలాకు అర్ధరూపాయికి ఎన్నో సంస్థలు అమ్మేశారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు డైరెక్షన్ మేరకు విద్యుత్ చార్జీలు భారీగా పెంచారని..ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఆందోళన కు దిగితే పోలీసులు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం తీసుకొచ్చారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తన హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్వీర్యం చేసేసి అన్ని శాఖల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం అమలు చేశారు. అంటే ఒక రెగ్యులర్ ఉద్యోగి చేసే పనులు ఈ అవుట్ సోర్సింగ్ కుర్రాడితో చేయించి కాసిన చిల్లరను జీతంగా ఇచ్చేవారు. ఇప్పటికీ అదే అవుట్ సోర్సింగ్ విధానం ఆంధ్రాలో కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. రోగుల నుంచి సైతం కొంత ఫీజు వసూలు చేసే యూజర్ చార్జీల విధానం తెచ్చింది కూడా చంద్రబాబేనని వైసీపీ నేతలు గుర్రతు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఆస్పత్రిలోనూ ఈ యూజర్ చార్జీలు వసూలు చేస్తూ వస్తున్నారని విశ్లేషించారు.

చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేవు.. కొత్త భవనాల నిర్మాణం అడ్మిషన్లు తగ్గిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ తన కార్పొరేట్ తరహా భావాలను అయన మనసులోని మాట అనే పుస్తకంలో ఘనంగా ప్రస్తావించారని గుర్తు చేస్తున్నారు.చంద్రబాబు నిజంగా విజనరీ అయితే రాష్ట్రం విడిపోయి అప్పటికే అప్పులు, అవస్థల్లో ఉన్న ఆంధ్రకు ప్రత్యేకంగా భారీ రాజధాని ఎందుకనేది వైసీపీ నేతల ప్రశ్న. మూడు పంటలు పండే పచ్చని భూములులను రాజధానికి సేకరించి దాన్ని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మారుస్తారా ? ఇదేనా విజన్ అంటూ వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రవ్నిస్తున్నారు. తన అనుచరులు, అనుయాయుల లబ్ది, వారికి దోచిపెట్టడం మినహా వేరే ఆలోచన లేదని విమర్శిస్తున్నారు.

Share post:

లేటెస్ట్