సినిమాలకు రిటైర్మెంట్!.. ’12th ఫెయిల్’ హీరో సంచలన నిర్ణయం

Mana Enadu : బాలీవుడ్ స్టార్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ’12th ఫెయిల్ (12th Fail)’ సినిమాతో విక్రాంత్ భారతీయ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాడు. అయితే ఈ 37 ఏళ్ల యువ నటుడు తాజాగా తన అభిమానులకు ఓ షాక్ ఇచ్చాడు. తాను కొంత కాలంపాటు కొత్త సినిమాలు చేయనని.. బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్టులో ఏం ఉందంటే..?

మీ ప్రేమను ఎప్పుడూ మరిచిపోలేను

“గత కొన్నేళ్లుగా మీ అందరి నుంచి అసాధారణమైన ప్రేమాభిమానాలు పొందుతున్నాను. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులకు ఇక పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన సమయం వచ్చింది. అందుకే కొన్నాళ్ల పాటు కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. 2025లో విడుదల కానున్న సినిమానే నా చివరిది. నేను నటించిన సినిమాలపై మీరు చూపిన ఆదరాభిమానాలను ఎప్పుడూ మర్చిపోలేను. ఎన్నో అందమైన జ్ఞాపకాలను అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు” అంటూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు విక్రాంత్.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

అలా ఎందుకు చేశారు?

విక్రాంత్ పోస్ట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సడెస్​గా ఈ హీరో ఇటువంటి డెసిషన్ తీసుకోవడం ఏంటని బాధపడుతున్నారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని కొందరు అంటుంటే..  మరికొందరు మాత్రం ఇదేదో ప్రమోషనల్ స్టంట్​లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరేదైనా రీజన్​ ఉంటే చెప్పండి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

బుల్లితెర నుంచి వెండితెరపై

ఇక విక్రాంత్ సినీ కెరీర్ విషయానికి వస్తే, హిందీలో పలు సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా విక్రాంత్ నటించిన Balika Vadhu (చిన్నారి పెళ్లికూతురు) చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2017లో ‘ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌ (A Death In The Gunj)’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకున్నాడు. గతేడాది విడుదలైన ’12th ఫెయిల్‌’తో భారతీయ ప్రేక్షకుల మనసు గెలిచాడు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *