PM MODI USA TOUR: క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌.. అమెరికా చేరుకున్న PM మోదీ

ManaEnadu: అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫిలడెల్ఫియా విమానాశ్రయం(Philadelphia airport) వెలువల ప్రవాస భారతీయుల(Expatriate Indians)తో ముచ్చటించారు. మోదీ రాక సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్యలో భారతీయులు(Indians) అక్కడికి చేరుకున్నారు. వారితో మోదీ కరచాలనం చేస్తూ, ఆటోగ్రాఫ్‌(Autograph)లు ఇచ్చారు. విద్యార్థుల(Students)తో ముచ్చ‌టించారు. మూడు రోజుల పర్యటనకు గానూ మోదీ అమెరికా(America) బయల్దేరి వెళ్లారు. అమెరికాలో ఆయన మొదట క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌(Quad Leaders Summit)లో పాల్గొంటారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తుండడం విశేషం.

 ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధిపై చర్చలు

అమెరికా పర్యటనలో భాగంగా PM మోదీ 6వ క్వాడ్ లీడర్స్ సమ్మిట్, ఐక్యరాజ్యసమితి ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్(Summit of the Future)’లో పాల్గొని ప్రసంగిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్వస్థలం డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఇండో-పసిఫిక్(Indo-Pacific) ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయపడటానికి ఈ శిఖరాగ్ర సమావేశంలోని నాయకులు గత ఏడాది పురోగతిని సమీక్షిస్తారని, రాబోయే సంవత్సరానికి ఎజెండా(Agenda)ను నిర్ణయిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రధాన చర్చ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనే

కాగా ఈ 6వ క్వాడ్ (QUAD) శిఖరాగ్ర సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War), పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇండో-పసిఫిక్‌లో పరిస్థితులు వంటి అంతర్జాతీయ సవాళ్లపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Australian Prime Minister Anthony Albanese), జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా(Prime Minister of Japan Fumio Kishida)తో మోదీ ద్వైపాక్షిక చర్చలు(Bilateral negotiations) జరుపుతారు. క్వాడ్ కూటమిలో IND, ఆస్ట్రేలియా, జపాన్, USA సభ్య దేశాలుగా ఉన్నాయి.

మరోవైపు SEP 22న లాంగ్ ఐలాండ్‌లోని ప్రవాస భారతీయులతో సంభాషించడానికి మోదీ న్యూయార్క్(New York) వెళ్లనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్(Semiconductors), బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో ఇరు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ అవుతారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *