Dengue Fever : డెంగీ బారిన పడిన వారు ఇవి తప్పక తినాల్సిందే

Mana Enadu : వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) చుట్టుముట్టేస్తుంటాయి. వైరల్ ఫీవర్స్, మలేరియా, గున్యా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలు పీడిస్తుంటాయి. ముఖ్యంగా డెంగీ బారిన పడి ప్రమాదకర పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వచ్చిందంటే చాలు రక్తకణాల సంఖ్య పడిపోయి త్వరగా బలహీనులుగా మారిపోతున్నారు. ఇక రోగనిరోధక వ్యవస్థ (Immune System) పటిష్ఠంగా లేకపోతే డెంగీ నుంచి కోలుకోవడం కాస్త క్లిష్టంగా మారుతోంది. అయితే డెంగీ జ్వరం నుంచి కాస్త త్వరగా కోలుకునేందుకు మీ డైట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి డెంగీ నుంచి బయటపడేసే ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా..?

బొప్పాయి ఆకు రసం (Papaya Leaf Juice)

డెంగీ జ్వరం (Dengue Fever) వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇచ్చే సలహా బొప్పాయి ఆకు రసం రోజులో కనీసం ఒక స్పూన్ అయినా తీసుకోవాలని. డెంగీ బాధితులు ఈ రసం తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ కౌంట్ మెరుగుపడుతుంది. మరోవైపు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కివీ ఫ్రూట్ (Kiwifruit)

డెంగీ జ్వరం వచ్చిన వారిని పరామర్శించేందుకు వెళ్లే వారు తీసుకువెళ్లే పండ్లలో తప్పకుండా ఉండేది కివీ ఫ్రూట్. డెంగీ బాధితులు తీసుకునే ఆహారంలో కివీ ఫ్రూట్ తప్పకుండా ఉండాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. ఈ పండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎర్రరక్త కణాలు (Red Plate Lets) ఉత్పత్తికి తోడ్పడుతుంది.

కొబ్బరినీళ్లు (Coconut Water)

సాధారణంగానే కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇక జ్వరం (Fever) వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. డెంగీ బారిన పడినప్పుడు శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం కొబ్బరినీళ్లు. అందుకే డెంగీ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తారు.

మేక పాలు (Goat Milk)

మేక పాలల్లో పుష్కలంగా ఉండే సెలెనియం రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో వైరస్‌ వృద్ధి చెందకుండా నియంత్రిస్తుంది. అందుకే డెంగీ బాధితులకు మేక పాలు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

వేప ఆకులు (neem leaf)

వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయన్న విషయం తెలిసిందే. ఇవి వైరస్‌ల వృద్ధిని, వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. డెంగీ చికిత్సలో ప్రకృతి సిద్ధమైన ఔషధంగా పని చేసే వేపాకులను రోజూ ఉదయాన్నే తినడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *