15కి పైగా హత్యలకు అతడే కారణమా?

మన ఈనాడు: సరిగ్గా 3ఏళ్ల క్రితం వనపర్తి జిల్లాలో జరిగిన నలుగురు కుటుంబ సభ్యుల హత్య మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్లే తాంత్రిక పూజలకే నలుగురు బలయ్యారు. పూజల పేరుతో అమాయకులను బలి తీసుకున్న నరహంతకుడుని ఎట్టకేలకు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ లో నలుగురు కుటుంబ సభ్యులు విగత జీవులుగా మృత్యువాత ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది.

నిందితుడు గుప్త నిధుల పేరుతో మూడు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో వనపర్తి జిల్లాలో, కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని అనంతపురంలోనూ ఇదే తరహా ఘటనల్లో సత్యం యాదవ్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 15మందికి పైగా హత్యలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

అమాయకులే టార్గెట్ గా తాంత్రిక పూజలు, హత్యలు..
తాంత్రిక పూజలు చేస్తున్నాడని మొదటి నుంచి సత్యం యాదవ్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ జాతీయ పార్టీ నుంచి కౌన్సిలర్ గా పోటి చేశాడు. విషయం తెలుసుకున్న సదరు పార్టీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే తన ప్రవృత్తిని మాత్రం వీడలేదు. అమాయకులను గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేస్తే అపార సంపద మీ సొంతం అవుతుందని నమ్మిస్తాడు. ఆ తర్వాత పూజలు చేసినందుకు తనకు భారీగా డబ్బు లేదా భూములు ఇవ్వాలని కోరతాడు. సంపదకు ఆశపడ్డ బాధితులు కోరినట్లుగా సత్యం యాదవ్ కు మూట చెప్పేవారు. అనంతరం నెలల తరబడి బాధితులకు చిక్కకుండా తిరిగేవాడు. ఎవరైతే తీవ్ర ఒత్తిడి తెస్తారో వాళ్లను అదే తాంత్రిక పూజల పేరుతో హత్యకు పాల్పడతాడని తెలుస్తోంది. తీర్థం రూపంలో పానీయం ఇచ్చి మిస్టరీగా హత మార్చుతాడు. ఇంత జరిగిన ఎక్కడ కూడా ఆధారాలు వదలడు ఈ మాయలమారీ.

మొదటి నుంచి సత్యమే నిందితుడు అని చెబుతున్నామని బాధితుల కుటుంబ సభ్యుడు కరీం పాషా తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేయాలని తమ కుటుంబ సభ్యులను నమ్మించాడని చెప్పాడు. పూజలు చేసినందుకు ప్లాట్ కూడా రాయించుకున్నాడని కరీం తెలిపాడు.

15కి పైగా హత్యలకు అతడే కారణమా?
నిందితుడు గుప్త నిధుల పేరుతో మూడు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో వనపర్తి జిల్లాలో, కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని అనంతపురంలోనూ ఇదే తరహా ఘటనల్లో సత్యం యాదవ్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 15మందికి పైగా హత్యలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

Related Posts

Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద…

Payal Rajput: నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ హీరోయిన్ నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(Vimal Kumar Rajput) (67) ఢిల్లీలో సోమవారం కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను తాజాగా పాయల్ సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *