మన ఈనాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19 నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం అయింది. కార్డుల పంపిణీ పాటు ఆరోగ్యశ్రీ పరిధి పెంచారు. వీటి సౌకర్యాలపై విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఒక్కో అసెంబ్లీ పరిధిలోని ఏదేసి గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఉన్న దానికంటే సుమారు ఐదు రెట్ల మేర ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచారు. ఇకపై రూ. 25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి చికిత్సకు ఉచితంగా వైద్యం అందనుంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ. 5 లక్షల వరకూ ఉన్న పరిమితిని రూ. 25 లక్షలకు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. .అంతేకాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి….? ఉచితంగా సేవలు ఎలా చేయించుకోవాలి..? వంటి విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇక ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ యాప్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ సమయంలోనే లబ్దిదారుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్ లోడ్ చేస్తారు. ఈ యాప్ లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆసుపత్రుల వివరాలు,ఏ హాస్పిటల్‌లో ఏ రోగానికి వైద్యం అందుతుందనే అన్ని వివరాలు ఉంటాయి.