మన ఈనాడు: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Congress AP Chief YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడుగా గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల తన కర్తవ్యాలను నిర్వహించనుంది.