చైనా HMPV వైరస్​ లక్షణాలు ఏంటి?.. నివారణ ఎలా?

కరోనాకు పుట్టిల్లయిన చైనాలో మరో కొత్త వైరస్ వ్యాపిస్తోందంటూ వచ్చిన వార్తలతో ప్రపంచం బెంబేలెత్తుతోంది. హ్యూమన్‌ మెటానిమో వైరస్‌ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు ఇప్పుడు ప్రజలను కలవరపెడుతున్నాయి. అయితే ఇది ప్రస్తుతం కట్టడిలోనే ఉందంటూ చైనా తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. అయితే దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ హెచ్‌ఎంపీవీ లక్షణాలు ఏంటి..? దీనికి నివారణ మార్గం ఏంటి?

హెచ్‌ఎంపీవీ లక్షణాలు ఇవే..?

  1. హెచ్‌ఎంపీవీ .. కరోనా (Corona), ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటుంది.
  2. దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పిగా ఉంటుంది.
  3. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీస్తుంది.
  4. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారంలోగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి

ఎలా వ్యాపిస్తుందంటే..?

దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్ల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ మహమ్మారి సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం, వారు వాడిన దుస్తులు వంటివి వాడటం వల్ల వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇక వైరస్‌ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు తెలిపారు.

వైరస్ నివారణ ఎలాగంటే..?

  1. సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.
  2. గంటకు కనీసం 6 సార్లయినా చేతులు శుభ్రం చేసుకోవాలి.
  3. హాండ్స్ వాష్ చేయకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకొద్దు.
  4. జలుబు, దగ్గు ఉన్న వారు తప్పకుండా మాస్కు ధరించాలి.

Related Posts

పొద్దాక కూర్చొని వర్క్ చేస్తున్నారా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే!!

Mana Enadu: గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తున్నారా? అయితే మీ హెల్త్ డేంజర్ జోన్లో ఉన్నట్లే. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఇలా వర్క్ చేయడం కామన్ అయిపోయింది. అయితే కూర్చొని గంటల తరబడి కదలకుండా పని చేయడం…

Beauty Tips: ఓట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆరోగ్యమే కాదు.. వావ్‌ అనిపించే సౌందర్యం కూడా మీ సొంతం..

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. దీనికి ముందుగా తీసుకున్న ఓట్స్ పౌడర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కాస్త మందంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *