వంశ రాజుల సంక్షేమానికి కృషి చేస్తానని ఉప్పల్ అసెంబ్లీ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
రామంతాపూర్ వంశ రాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బీఎల్ఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని మరో వందేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలనలోనే చేసుకోందామని కోరారు. ప్రధానంగా యువతతోనే రాజకీయాలు, సమాజ మార్పు సాధ్యం అవుతుందని, బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించి కారు వేగం పెంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు, వంశ రాజ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంశ రాజ్ మల్లేశ్, రామంతపూర్ వంశ రాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిటికల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి పాయసం గోపాల్ , సభ్యులు బాలస్వామి తిరుపతయ్య నరసింహ, కృష్ణ వెంకటయ్య ,చందు, శ్రీనివాస్, ముత్తయ్య ,కాశయ్య ,రేనయ్య పాల్గొన్నారు.