మన ఈనాడుః భారతీయ జనతాపార్టీ ఉప్పల్ అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ గెలుపు కోసం మల్లాపూర్ డివిజన్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సామన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆలోచించే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ ను గెలిపంచేందుకు కమలం గుర్తు ఓటు వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అంతేగాకుండా ఎన్‌వీఎస్ ప్రభాకర్ గెలిపిస్తే స్థానకంగా ఉన్న అర్హులకే రెండు పడకల ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తారని అన్నారు. ఉప్పల్‌కు ఎన్‌వీఎస్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప..బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చేసేందేమి లేదన్నారు. ఈకార్యక్రమంలో భాజపా నాయకులు జనరల్ సెక్రెటరీ ముత్యం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ గౌడ్, దొడ్డి యాదగిరి, బోదాసు మాధవి, రామ్ చందర్, పవన్, నరసింహ, గణేష్, తిరుపతి రెడ్డి, రాముల నాయక్, వెంకటేష్ పాల్గొన్నారు.
కమలం గెలవాలి..ఉప్పల్ అభివృద్ధికి తిరుగులేదు!
లేటెస్ట్