మన ఈనాడు, హైదరాబాద్
ప్రజలంతా కారు గుర్తుకు ఓటేస్తే..మన షాద్‌నగర్ తిరుగులేని అభివృద్ధి సాధిస్తుందని ఎన్నికల ఇంఛార్జీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. నందిగామ మండలం చిలకమర్రి, అప్పారెడ్డిగూడెం, సర్పంచ్ జీకే.నర్శింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సర్కారు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గంగపుత్రలు, మహిళలను ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ పార్టీలోకి ఆహ్వనించారు.
హ్యట్రిక్ సీఎం..హ్యట్రిక్ ప్రభుత్వంలో మూడోసారి సీఎం కేసీఆర్ మళ్లీ మనందరికి సంక్షేమ పథకాలు అందించబోతున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. 80స్థానాల్లో గులాబీ జెండా ఎగరబోతుందన్నారు. తొలిస్థానం షాద్‌నగర్ ఉండేలా ఇక్కడి ప్రజలు కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరారు.