వరంగల్:
నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో గణేష్ యూత్ ఏర్పాటు చేసిన వినాయకుడు లడ్డు వేలం పాట బుధవారం నిర్వహించారు.
9రోజులు పాటు గణపయ్యకి ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డు వేలం హోరాహోరీగా సాగింది.
రావుల కుమారస్వామి రూ.50వేల కి అత్యధికంగా పాట పాడి తొమ్మిదిరోజులు నిత్య పూజలు అందుకున్న గణపయ్య లడ్డూను రావుల కుమారస్వామి సొంతం చేసుకున్నారు.
గణేష్ యూత్ అసోసయేషన్ సభ్యులు కుమారస్వామి దంపతులకి లడ్డూను అందజేశారు. అనంతరం నిమ్మజ్జన కార్యక్రమంలో భాగంగా వినాయకుని శోభాయాత్ర కన్నుల పండువుగా సాగింది.