మల్కాజిగిరిలో ‘మర్రి’కి నందికంటి బలం

హైదరాబాద్​:   మల్కాజిగిరి అసెంబ్లీ బీఆర్​ఎస్​ అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డికి నందికంటి బలంగా మారనున్నారని మంత్రి కేటీఆర్​ అన్నారు. బీఆర్​ఎస్​లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్‌ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ పేర్కొన్నారు.

         మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్‌ డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శ్రీధర్‌ తన అనుచరులతో కలిసి బుధవారం సాయంత్రం బీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీధర్‌తోపాటు కాంగ్రెస్‌ను వీడిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్‌, విప్‌ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్సీన నవీన్‌కుమార్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

    ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున దాదాపు టికెట్‌ ఖరారై, చివరి నిమిషంలో తీరని అన్యాయం జరిగిందనే ఆవేదనతో నందికంటి బీఆర్‌ఎస్‌లో చేరాలనే పెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జీవితంలో మొదటిసారిగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వస్తున్న శ్రీధర్‌ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

గత పదేండ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సరైన ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు. గత పదేండ్లలో హైదరాబాద్‌ నగరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో, ఈ ఏవిధంగా అభివృద్ధి అయిందో గుర్తించాలని అన్నారు. నందికంటి శ్రీధర్‌కు కాంగ్రెస్‌ పార్టీలో అన్యాయం జరిగిందని, బీఆర్‌ఎస్‌లో ఆయనకు తగిన గౌరవం కల్పిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న శ్రీధర్‌.. కాంగ్రెస్‌లో ఎంత నిబద్దతతో పని చేశారో తాను అంతే నిబద్దతతో బీఆర్‌ఎస్‌లో కూడా పని చేస్తానని చెప్పిన మాటలు ఎంతో నచ్చాయని అన్నారు. శ్రీధర్‌తోపాటు ఆయన అనుచరులను కాపాడుకుంటామని, వారిని కూడా సరైన విధంగా గౌరవించుకుంటామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు ఉన్న హైకమాండ్‌, నాయకులు కేసీఆర్‌ ఒక్కరు మాత్రమేనని, ఆయన ఆదేశాలు, సూచనల మేరకు మాత్రమే పార్టీ పని చేస్తుందన్నారు. తమకు ఢిల్లీలో బాసులు లేరని చెప్పారు.

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *