హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు తీర్పు కాషాయం జెండాను గెలిపించేలా ఉండబోతుందని BJP రాష్ర్ట నాయకుడు గడ్డం సాయికిరణ్ అన్నారు. ప్రజాదీవెన యాత్రను హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ నుంచి ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను కరపత్రం ద్వారా ప్రతీ ఇంటికి తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసేది బీజేపీ మాత్రమేనని తెలిపారు. కేసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణ ,నీళ్లు,నిధులు,నియామకాలు అని ప్రజలను మోసం చేశారని విమర్శలు చేశారు.ఈ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేవరకు సైనికుడిలా పని చేస్తానని అన్నారు
ఈ కార్యక్రమంలో రాగి వెంకటరెడ్డి, పారుపల్లి హనుమంతరావు, పీసరి శంకర్, ఆవుల సుధాకర్, యండపల్లి సుదర్శన్ రెడ్డి, యాద ఉపేందర్, రఘు రెడ్డి, పి.అనిల్ గౌడ్, గడ్డం వెంకట్ సాయి, శివ గౌడ్, శివా రెడ్డి, రంజిత్ సింగ్, ఇమ్రాన్, చరణ్, నవీన్ రెడ్డి, అన్నం సాయి, పవన్ సంతోష్ పాల్గొన్నారు.
Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి
ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…