యవతకు ఆదర్శం..రాజకీయాల్లో ‘అనంత’సేవలు

మన ఈనాడు: యువతకు ఆదర్శంగా నిలుస్తూ..రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇస్తున్న కౌకుట్ల ‘అనంతరెడ్డి’సేవలు నాగారం పురపాలకం తమదైన ముద్ర వేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారామే తన ఎజెండాగా జనం వద్దకు వెళ్లే యువనేతగా మేడ్చల్​ జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు జన్మదిన వేడుకులు జరుపుకుంటున్న నాగారం పురపాలక సంఘం పరిధిలో అత్యధిక మెజార్టీ సాధించిన 6వార్డు కౌన్సిలర్కౌకుట్ల అనంతరెడ్డికి ‘మన ఈనాడు’ డిజిటల్​ ఎడిషన్​ అందిస్తున్న ప్రత్యేక కథనం

కష్టాల్లో ఉన్న ప్రజలు ఎవరొచ్చి సాయం చేయాలనే పిలుపుందిందే చాలు అక్కడ ఆయన సేవలు అందుతాయి. అన్నా అంటే రాజకీయాలకు అతీతంగా ముందుండి సేవా చేసే తత్వంతో ఉంటారు. నాగారం పురపాలకం సంఘం ప్రజల కష్టాలను గుర్తించి ముందండి సేవ చేసే నాయకుడిగా చిన్న వయస్సులోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

నాగారం ప్రధాన రహాదారి నుంచి శిల్పాకాలనీకి చేరుకునే మార్గం ఆధునీకరణ పనులు చేపట్టి అక్కడి ప్రజల చిరకాల వాంచ తీర్చబోతున్నారు. ఇప్పటికే అక్కడే పార్కుతోపాటు ఓపెన్​ జిమ్​ ప్రారంభించి నాగారం పురపాలక సంఘంలోనే తమదైన మార్కు చూపించారు.

ప్రతి ఏటా వచ్చే వరదలతో ముంపుతో ఇబ్బందులు పడి శిల్పాకాలనీ మార్గంలో నూతన వరదనీటి పైపులైన్లు వేసి ఆమార్గం ప్రజల కష్టలు తొలగించారు. లక్ష్మినగర్​ కాలనీలో అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను గుర్తించారు. మౌలిక సదుపాయాలు విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహాదారులు అనేక సౌకర్యాలతోపాటు సంక్షేమ పథకాలు కల్పించి ప్రజల మన్ననలు అందుకుంటున్న యువనాయకుడుగా ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నారు.

Share post:

లేటెస్ట్