జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. కేసీఆర్‌పై పాట విడుదల చేసిన కేటీఆర్‌

“యుద్ధం ముద్దాడిన యుద్ధవీరుడు.. కాలం కనిపెంచిన పోరు సూర్యుడు.. స్వేచ్ఛను బతికించిన స్వప్నికుడతడు.. నిత్యం నినదించిన పిడికిలి అతడు.. పోరై నిలిసిండురా తెలంగాణల.. పొద్దై పొడిసిండురా పల్లె పల్లెనా.. సారు కేసీఆరూ జనం పొలికేక పోరురా.. జయజయ జననేత.. తెలంగాణ జాతిపిత.. తరతరాలు నీ చరిత మరిచిపోదు ఈ జనత”.. అంటూ  బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై ఓ పాట విడుదలైంది.

తెలంగాణ జాతిపిత కేసీఆర్

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌పై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ (Gadari Kishore) ఈ పాటను రూపొందించారు. జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. అంటూ సాగే ఈ పాటను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేసీఆర్ తనయుడు కేటీఆర్ (KTR) ఆవిష్కరించారు.  హైదరాబాద్‌ నందినగర్‌లోని నివాసంలో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి ఈ పాటను ఆయన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

జయజయ జననేత కేసీఆర్

మానుకోట ప్రసాద్‌ రచించిన ఈ పాట (Telangana Jathipitha Song)ను సింగర్ సాకేత్‌ (Singer Saketh) పాడారు. మిథున్‌ సంగీతం అందించగా.. అజయ్‌ కొడం డీఓపీగా వ్యవహరించారు. ఇక ఈ పాట ఆవిష్కరణ  కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీశ్‌, కల్లెట్లపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related Posts

KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *