Guntur Kaaram : గుంటూరు కారం టీమ్‌పై నెటిజన్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి

గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఓ నెటిజన్ ఈ సినిమా టీమ్ ను విమర్శిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీనికి పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Guntur Kaaram : మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గుంటూరు కారం’ 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఓ వైపు సినిమా ప్రమోషన్లు.. మరోవైపు సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమా యూనిట్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీమ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుపై రామజోగయ్య శాస్త్రి ఫైర్ అయ్యారు. నెటిజన్ పోస్టుకి ఆయన ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతోంది.

గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘దమ్ మసాలా’ అనే సాంగ్ రిలీజ్ చేసి దుమ్ము రేపిన మేకర్స్ తాజాగా ‘ఓ మై బేబీ’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటని శిల్పారావు పాడారు. ఇంకా ఈ సినిమాలో మరో రెండు పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీమ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ (@DPGAMERS9) ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. ‘ ఇది నిదర్శనం అంటూ వరస్ట్ లిరిక్స్, వరస్ట్ మ్యూజిక్ అండ్ బీట్స్, ఓవర్ యాక్టింగ్ కేండిడేట్, అసలు ఎటువెళ్లిపోతుందో తెలియని గుంటూరు కారం.. అని రాస్తూ రామజోగయ్య శాస్త్రిని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ని, నిర్మాత నాగవంశీని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు.

నెటిజన్ పోస్టుపై రామజోగయ్య శాస్త్రి మండిపడ్డారు. ‘సోషల్ మీడియాలో కుక్కలు తిరుగుతున్నాయి.. కొంతమందికి నిజంగా ఇక్కడ జరిగే ప్రక్రియ గురించి తెలియదు.. మనసులో దురుద్దేశం పెట్టుకుని తమ కామెంట్లతో ప్రతీది జడ్జ్ చేస్తారు.. టెక్నీషియన్లను టార్గెట్ చేస్తారు.. ఇది అస్సలు మంచిది కాదు.. ఎవరో ఒకరు మాట్లాడాలి.. గీత దాటుతున్నారు వీళ్లు..’ అంటూ రిప్లై చేశారు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పెట్టిన రిప్లై వైరల్ అవుతోంది. గతంలో కూడా రామజోగయ్య శాస్త్రి తన పాటలపై నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కున్నారు.

Related Posts

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట…

పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *