Health: అలెర్ట్.. మానకపోతే జరిగేది ఇదే..!

మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

సిగరేట్‌ స్మోక్ అన్నది అతి పెద్ద బ్యాడ్‌ హ్యాబిట్‌గా చెబుతుంటారు డాక్టర్లు. అటు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికారం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కొంతమంది వినరు. ఈ రెండు అలవాట్లు ఉన్నవారికి మెదడు సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. శరీరంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్గన్‌ బ్రెయిన్‌. ఇటీవల కాలంలో చాలా మందికి జ్ఞాపకశక్తి ఉండడంలేదని నివేదికలు చెబుతున్నాయి. మారిన లైఫ్‌ స్టైల్‌తో పాటు ఇతర విషయాల వల్ల కూడా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గడానికి వివిధ రకాలు కారణాలు ఉన్నాయి. వాటిలో సిగరేట్, అల్కహాల్‌ ప్రధానమైనవి.

మద్యపానం, ధూమపానం వల్ల జ్ఞాపకశక్తి ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకోండి.

మద్యపానాన్ని తగ్గించడం మరియు ధూమపానం మానేయడం అనేక కారణాల వల్ల జ్ఞాపకశక్తికి ప్రయోజనకరంగా ఉంటుంది:

మెదడు ఆరోగ్యం: మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది . అంతేకాదు జ్ఞాపకశక్తితో సహా అభిజ్ఞా పనితీరును దెబ్బతీస్తుంది.

తగ్గిన రక్త ప్రవాహం: ధూమపానం రక్త నాళాలను తగ్గిస్తుంది. మెదడుకు ఆక్సిజన్ పోషకాల ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది.

న్యూరోఇన్‌ఫ్లమేషన్: ఆల్కహాల్, స్మోకింగ్ రెండూ న్యూరోఇన్‌ఫ్లమేషన్‌కు దారితీయవచ్చు. ఇది సాధారణ మెదడు పనితీరుతో పాటు జ్ఞాపకశక్తి ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది.

తగ్గిన నిద్ర నాణ్యత: ఆల్కహాల్, నికోటిన్ వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. దీని వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

ఈ రెండు అలవాట్ల వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. అందుకని ఇవి మానితే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

అటు ఈ రెండు అలవాట్లతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి కొన్ని టిప్స్‌ పాటించండి.

Related Posts

Health Tips: డయాబెటిస్‌లో జామ ఆకులను ఎలా తినాలో తెలుసా!

Mana Enadu: డయాబెటిక్ రోగులకు చాలా ప్రభావవంతమైనదిగా భావించే పండు జామ. జామకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు జామ ఆకులను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. డయాబెటిక్…

Raw Coconut Benefits: పచ్చికొబ్బరి తింటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిచి రకాల రోగాలను నయం చేస్తుంది. పచ్చి కుడక బెల్లం తింటే దీర్ఘకాలిక వ్యాధులు రావు. పచ్చికొబ్బరి శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని, జుట్టు సౌందర్యాన్ని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *