ఉప్పల్:తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మీర్ పేట్ HB కాలనీ డివిజన్ తిరుమల నగర్ కాలనీ లో ఉప్పల్ BRS MLA అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి జాతీయజెండా ఎగరవేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు , కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశంలోనే అభివృద్ధిలో ముందున్నదని అన్నారు, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలోని నెంబర్ వన్ గా నిలిచింది అన్నారు, తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్నం అని అన్నారు, దేశ సమగ్రత సమైక్యతకు తెలంగాణ పాటుపడుతున్నదని అన్నారు..
ఈ కార్యక్రమంలో మీర్ పేట్ HB కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి,BRS నాయకులు జంపాల్ రెడ్డి,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.