మన ఈనాడు:చిలుకానగర్ డివిజన్, బిరప్పగడ్డ నుంచి ప్రారంభమైన ఉప్పల్ BRS ఎమ్మెలే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా అన్నపూర్ణ కాలనీ, శ్రీనగర్ కాలనీ, మజీద్ కాలనీ, మండే మార్కెట్ మీదుగా కొనసాగుతున్న ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జైకేసీఆర్, జై బీఎల్ఆర్ నినాదాలతో పూలవర్షం కురిపిస్తున్నారు. శాలువాలతో సన్మానాలు చేస్తూ స్వాగతం పలుకుతున్నారు. మహిళలలు నుదటిపై తిలకం పెట్టి, హారతులు పడుతూ డివిజన్ ప్రజలు బండారి లక్ష్మారెడ్డి ప్రచారానికి ఆశీస్సులు అందిస్తున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తల సైన్యం రోజురోజుకు రెట్టింపు ఉత్సహంతో ముందుకు కదులుతోంది. పదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా బీఎల్ఆర్ ప్రజలతోనే ఉంటాడని భరోసా ఇచ్చారు.