Heavy Rains: తుఫాను ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌‌లో కురుస్తున్న భారీ వర్షాలపై CM Chandrababu సమీక్షించారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. మరోసారి టెలీకాన్ఫరెన్స్(Teleconference) ద్వారా CS, DGP, మంత్రులు, కలెక్టర్లు, SPలు, RDOలు, DSPలతో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని CM ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మరోవైపు విజయవాడలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం(Exgracia) ప్రకటించాలని ఆదేశించారు. రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని సీఎం చంద్రబాబు అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. అటు వర్షాలు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని సీఎం ఆదేశించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలకు వెనకాడవద్దని సీఎం అన్నారు.

 ఇవాళ రాత్రి తుఫాను తీరం దాటు ఛాన్స్

శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య ఇవాళ రాత్రి తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలన్నారు. రాత్రి అంతా మెలుకువతో ఉండి అయినా సరే ప్రజల రక్షణ కోసం పనిచేద్దామన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పాటించాలని అధికారులకు సూచన చేశారు.

తెలంగాణలోనూ భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

మరోవైపు తెలంగాణ(Telangana)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జనగామ, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, MBNR, మంచిర్యాల, మల్కాజ్‌గిరి, నారాయణపేట్, నిర్మల్, RR, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, WGL, హన్మకొండ, భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. మరోవైపు శనివారం కురిసిన భారీ వర్షాలు పలుచోట్ల విషాదం నింపాయి. కామారెడ్డి(D) నస్రుళ్లబాద్(మ) నాచుపల్లిలో కరెంట్ షాక్‌తో డిగ్రీ విద్యార్థిని స్వాతి(18) మృతి చెందారు. ఇంటి వెనుక చెట్టుపై పిడుగుపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అవి నేరుగా రేకుల ఇంటిని తాకటంతో విద్యుత్ సరఫరా అయ్యింది. ఇంటి తలుపులు ముట్టుకున్న స్వాతి అక్కడికక్కడే చనిపోయింది. అటు ములుగు(D) తాడ్వాయి నార్లాపూర్‌లో పిడుగుపాటుకు యువకుడు మహేశ్ మృతి చెందాడు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా హైదరాబాద్‌లోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు.

Share post:

లేటెస్ట్