Mana Enadu: ‘ఇంకా ఎన్నాళ్లు ఒకరి చేతి కింద ఉద్యోగం చేయాలి? నా దగ్గర సరిపడా డబ్బు ఉంటేనా.. వ్యాపారం(Business) మొదలెట్టి కాలిపై కాలేసుకొని కూర్చునేవాణ్ని’ ఇది సగటు ఉద్యోగి(Employee) మదిలో మాట. ‘ఏదో కూడబెడతానని వ్యాపారం మొదలెట్టాను. ఇంత ఒత్తిడి(Pressure) ఉంటుందని తెలిస్తే.. హాయిగా ఉద్యోగమే చూసుకునేవాణ్ని. అలా చేసినా.. ప్రశాంతంగా బతికేవాణ్నేమో’ ఇది ఓ వ్యాపారి అంతరంగం. డిగ్రీ పూర్తై పట్టా చేతికి రాగానే.. విద్యార్థి మెదడు పుట్టెడు ఆలోచనలతో నిండిపోతుంది. అందులో ఇదొకటి. తీరా డిగ్రీ పూర్తి చేశాక వ్యాపార ఆలోచన కన్నవాళ్ల ముందుంచితే.. ‘ఇంత ఖర్చుపెట్టి నిన్ను చదివించింది అందుకేనా? అన్నట్లు రియాక్షన్ ఇస్తారు. ‘వ్యాపారం నీవల్ల అవుతుందా? ఇంత చిన్న ఏజ్(Age)లో ఇవన్నీ ఎందుకు? నష్టాలు వస్తే ఆ భారాన్ని మనం మోయగలమా?’ అని డీమోటివేట్(Demotivate) చేస్తారు. వారి మాటలకు ఉద్యోగమే బెటర్ అనిపించేలా చేస్తారు. దీంతో చాలామంది ఉద్యోగం(Job) చేయాలా? వ్యాపారం చేయాలా? అనే సందిగ్ధంలో పడిపోతున్నారు నేటితరం యువత. ఇంతకీ ఏది మేలో తెలుసుకుందామా..
ఉద్యోగం అయితే ఇలా
ఉద్యోగంలో రిస్క్(No Risk) ఉండదు. పెట్టుబడి(Investment) పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక చోట కొలువు పోయినా మరో దగ్గర ఆఫర్ రెడీగా ఉంటుంది. సమయపాలన, కష్టపడే తత్వం ఉంటే పనిచేసే కంపెనీలోనే అంచెలంచెలుగా ఎదగొచ్చు. నెలంతా కష్టపడితే.. సాలరీ మెసేజ్ వచ్చేది ఒక్కసారే. ఆ తర్వాత అన్నీ డెబిట్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అనే వస్తాయి. అందుకే చాలామంది అసంతృప్తితోనే కాలం వెళ్లదీస్తుంటారు. కంపెనీ మారాలి, సాలరీ పెరగాలి అని ఆశలతో జీవిస్తూ ఉంటారు. ఉద్యోగంతో ఇంట్లోవారిని కూడా సరిగా చూసుకోలేని పరిస్థితి వస్తుంది. లీవ్స్(Leaves), బోనస్‌ల కోసం ఎదురుచూస్తూనే.. కాలం గడిచిపోతుంది.
వ్యాపారంలో అయితే..
ఇష్టమున్నప్పుడు పని చేసుకోవచ్చు. ఒకరి చేతి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు డబ్బు వస్తూనే ఉంటుంది. చిన్న వ్యాపారం(Business) మొదలెట్టి పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదిగినవారు చాలామంది ఉన్నారు. మనకు కూడా ఆ అవకాశం ఉంటుంది.
వ్యాపారంలో అనువణువునా రిస్క్ ఉంటుంది. ఇందుకు చాలా పెట్టుబడి కూడా కావాలి. వ్యాపారంలో కచ్చితంగా లాభాలే వస్తాయని 100% గ్యారంటీ లేదు. తెలియకుండా వ్యాపారంలోకి దిగి నష్టపోతే.. జీవితమే కోల్పోవచ్చు. ఉద్యోగంతో పోలిస్తే ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలో లాభాలు వచ్చినట్టే అనిపిస్తాయి. కానీ, వాటిని నిలబెట్టుకోవడం అతి ముఖ్యమైన సవాలు.
దేని సత్తా దానిదే..
ఉద్యోగం కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ దేని సత్తా దానిదే.. మీరు వ్యాపారంలో రాణించగలరని నమ్మకం(Belife) ఉంటే ఆ దిశగా అడుగులేయండి. అది కూడా మీ సొంత పెట్టుబడితోనే ప్రయత్నించండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెచ్చించకుండా మెళ్లిమెళ్లిగా బిజినెస్‌ను డెవలప్ చేసుకోండి. సరైన ప్రణాళిక(Planning), కస్టమర్లను రప్పించగల సత్తా ఉంటే.. వ్యాపారంలో మీకు తిరుగు ఉండదు. కొత్త కస్టమర్లను పెంచుకుంటూ.. అందులో వచ్చిన లాభాలను బిజినెస్‌ను డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తే.. కొద్దికాలంలోనే ధనవంతులైనా ఆశ్చర్యం లేదు.








