Mana Enadu: గోళ్లు కొరకడం(Nail-Biting) అనేది చాలా మందికి ఉండే అలవాటు. గోళ్లు కొరకడం మంచిది కాదని పెద్దలు చెప్పగా వినే ఉంటాం. అయితే ఈ అలవాటును మానుకోవాలని ఎంత ప్రయత్నించినా కొందరిలో మాత్రం ఇది సాధ్యం కాదు. ఎక్కువగా చిన్నపిల్లలకు(Childrens) ఈ అలవాటు ఉంటుంది. క్రమంగా వాళ్లు పెరుగుతున్నకొద్దీ ఈ అలవాటు కూడా పెరుగుతుంది. ఈ అలవాటును ఒనికోఫాగియా(Onychophagia) అంటారు. ఎక్కవ శాతం మంది టెన్షన్(Tensin)గా ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతారు. ఇంకొందరు ఖాళీగా ఉంటే చాలు అదే పనిగా గోళ్లు కొరుకుతూ ఉంటారు. కొందరిలో రోజువారీ పరిస్థితులు, ఒంటరిగా ఉన్నా, డిప్రెషన్(Depression)కు గురైనా, కోపం వచ్చినా లేదా అధిక సంతోషంతో ఉన్నా, ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నప్పుడు గోళ్లు కొరుకుతారు. ఇది వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఈ అలవాటు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతర ఆరోగ్య సమస్యలు ఖాయం
గోళ్లు కొరకడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు(Doctors advise) చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు(Consequences) వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇదొక చెడు అలవాటు మాత్రమే కాదు, అనారోగ్యం కూడా. ఈ అలవాటు వల్ల గోళ్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వాటిలో ఉండే సార్మేనేలా, క్లేబ్సిల్లా ఇంకా ఇతర బ్యాక్టీరియాలు నోట్లోకి వెళ్లడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వేళ్లచివరి చర్మం నాశనమయ్యి, కణాజాలం దెబ్బతింటుంది. గోళ్లు(Nails) అసాధారణంగా కనిపిస్తాయి. ఇంకా గోళ్ల చుట్టు పుండ్లు ఏర్పడుతాయి. ఇంకా ఈ అలవాటు అధికంగా ఉండే వారికి కడుపు, ప్రేగు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో కాల్షియం లోపం వల్ల ఈ అలవాటు ఉంటుంది. ఈ సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఈ అలవాటును మానుకోవడంతో పాటు గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం మంచిది.
గోళ్లు కొరకడం మానేయడం ఎలా..
మనం చెతులను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పటికి గోళ్లలో బ్యాక్టీరియా(Bacteria) ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. ఈ అలవాటును మానుకోవాలి అనుకునే వారు మౌత్ గార్డుల(Mouthgourds)ను వాడటం మంచిది. ఇంకా గోళ్లకు నెయిల్ పాలిష్(nail polish) వేయడం వల్ల గోళ్లు నోట్లో పెట్టుకోగానే పాలిష్ వాసన వస్తుంది. ఈ వాసన వల్ల గోళ్లు కొరకడానికి ఇష్టపడరు. గోళ్లను చిన్నగా కత్తిరించుకోవాలి. అలాకాకుండా వాటికి ఏదైనా చేదుగా ఉండే పదార్థాలను రాసుకోవడం వల్ల గోళ్లు కొరికేటప్పుడు చేదుగా ఉటుంది. ఒక వేళ ఒత్తిడి వల్ల గోళ్లు కొరుకితే దానికి బదులుగా చూయింగ్ గమ్ నమలడం, స్ట్రెస్ బాల్ ప్రెస్(Stress ball Press) చేయడం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ఈ అలవాటును మానుకోవచ్చు.
అయితే చాలా మంది మేము గోళ్లు కొరకడం లేదు.. పెంచుకుంటున్నాం కదా దీనివల్ల ప్రమాదమేంటి అనుకుంటారు. అయితే గోళ్లు కొరకడం వల్ల ఏలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయో.. గోళ్లు పెంచుకోవడం వల్ల కూడా నష్టాలు చాలానే ఉన్నాయి. చాలా మంది గోళ్లు అందంగా కనిపించడానికి వాటిని పెంచుకుంటారు. అయితే మనం చేతులను ఎంత శుభ్రంగా కడుక్కున్నా గోళ్లలో ఉండే క్రీములు పూర్తిగా నశించవు. అవి గోళ్ల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి అనేక రకాల రోగాలను వ్యాప్తి చేస్తాయి. స్నానం చేసేటప్పుడు తేలియకుండా శరీరానికి గీసుకోవడం వల్ల పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా గోళ్లకు ఏదైనా బలమైన దెబ్బ తగిలితే భరించలేని నొప్పి ఉంటుంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవడం మంచిది.