Swine Flu: తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం.. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ

ManaEnadu: తెలంగాణలో ఓ పక్క వర్షాలు వణికిస్తుంటే.. మరో పక్క సీజనల్ వ్యాధులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికన్ గున్యా వంటి వైరస్‌లు ప్రజలను ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. తాజాగా వీటికి తోడు స్వైన్ ఫ్లూ(Swine Flu) కూడా ప్రబలుతోంది. తెలంగాణలో నాలుగు(4) స్వైన్ ఫ్లూ కేసులు నమోదవడంతో ఇటు ప్రజలు, అటు వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. 2009లో అమెరికాలో పెను అలజడినే సృష్టించిందీ వైరస్. ఆ తర్వాత ఎక్కడా అంతలా ప్రభావం చూపలేదు. తాజాగా ఇప్పుడు మన దగ్గర ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది. వీటిని హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ధ్రువీకరించింది.

IPM రిపోర్టు ప్రకారం.. మాదాపూర్‌లో ఉంటున్న వెస్ట్ బెంగాల్‌(West Bengal)కు చెందిన యువకుడు (23)కి తీవ్ర దగ్గు, ఇతర లక్షణాలతో ఓ ప్రైవేటు దవాఖానకు వెళ్లాడు. అక్కడ అనుమానం రావడంతో నారాయణ గూడ IPMకి నమూనాలను పంపించారు. అక్కడ స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయింది. అలాగే టోలిచౌకిలో ఉంటున్న 69 ఏళ్ల వృద్ధుడికి కూడా పాజిటివ్‌గా తేలింది.

నిజామాబాద్‌(NZB)లో ఒకరికి, హైదర్‌నగర్‌లో ఒక మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయట పడడంతో వారి శాంపిల్స్‌ HYD నారాయణగూడ IPM ల్యాబ్‌కు తరలించారు. ఆ శాంపిల్స్‌కు సంబంధించి టెస్టులు నిర్వహించగా.. నలుగురికి స్వైన్‌ ఫ్లూ(Swine Flu)లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమైంది. మరోవైపు ప్రజలనూ తగు సూచనలు చేసింది. ఇంతకీ స్వైన్‌ లక్షణాలు ఎలా ఉంటాయి? అది ఎలా వ్యాపిస్తుంది? ఒకవేళ ఇది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు.. స్వైన్‌ ఫ్లూ వ్యాపించకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అనే తదితర వివరాలు గురించి తెలుసుకుందాం.

స్వైన్‌ ఫ్లూ లక్షణాలివే..

☛ స్వైన్‌ ఫ్లూ.. H1N1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ద్వారా సంక్రమిస్తుంది.
☛ సాధారణ ఫ్లూ జ్వరం మాదిరిగానే స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉంటాయి.
☛ మొదట సాధారణ జ్వరం(Fever), ఆ తర్వాత లక్షణాలు తీవ్రతరం అవుతాయి.
☛ ముక్కు కారడం, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, నీరసం, దగ్గు, గొంతు నొప్పి, చలి, చెమటలు, కళ్లు ఎర్రబడటం, బాడీ పెయిన్స్(Body Pains), తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
☛ వ్యాధి ముదిరితే బలహీనత, అతిసారం, కడుపునొప్పి, వాంతులు(Vomtings) వంటి లక్షణాలు ఉంటాయి.
☛ సీజనల్‌ వ్యాధుల ద్వారానే స్వైన్‌ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది.
☛ సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయం కూడా ఏర్పడే ఛాన్సుంది.

 ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి

☛ స్వైన్‌ ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపిస్తుంది.
☛ ప్రబలకుండా ఉండేందుకు విధిగా మాస్కులు ధరించాలి.
☛ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉంటే వైద్యుడి(Doctor)ని సంప్రదించాలి.
☛ ఫ్లూ బారిన పడకుండా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి.
☛ ఆరేళ్లలోపు పిల్లలు, 60ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
☛ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు తక్షణమే సంప్రదించాలి.
☛ తాజా పండ్లు(Fruits), పాలు(Milk), గుడ్లు(Eggs) ఆహారంగా తీసుకోవడంతోపాటు ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తినాలి.

 

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Sonia Gandhi: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఏమైందంటే!

కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *