Mana Enadu: టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్లేయర్, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. గత ఏడాది మొదలైన ఈ నిప్పురవ్వ భారీ మంటలా మారింది. అయితే, IPL-2024లో ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందని అభిమానులు ఎదురుచూశారు. ఈ క్రమంలో గౌతీ-కోహ్లీ మైదానంలో హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. అయినా అటు బీసీసీఐ పెద్దల్లో, ఇటు అభిమానుల్లో ఎక్కడో తెలియని ఆందోళన.
కోహ్లీ.. గంభీర్.. ఓ చిరునవ్వు..
నీరు-నిప్పులా ఉండే వీరిద్దరూ ఇకే ఒరలో ఎలా నెగ్గుకొస్తారా అని కానీ అందరి అనుమానాలకు గౌతీ-కోహ్లీ జోడీ ఫుల్‌స్టాప్ పెట్టింది. తాజాగా శ్రీలంక టూర్‌లో వీరిద్దరూ ప్రాక్టీస్ సెషన్‌లో నవ్వుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే, ఇద్దరు ఆటగాళ్ల మధ్య కనిపించిన స్నేహం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఫొటోలో, విరాట్ చెప్పిన దానికి గంభీర్ బిగ్గరగా నవ్వుతూ కనిపించాడు. ఈ ఫొటోను BCCI ట్విటర్‌లో, ICC ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాయి. దీంతో తెగ ట్రెండ్ అవుతోంది.
అసలు ఏంటీ కోహ్లీ-గంభీర్ వివాదం..
IPL-2023 సీజన్ సందర్భంగా RCB ప్లేయర్ విరాట్ కోహ్లీ, LSG మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ పెద్దది కావడంతో మైదానంలోనే కోహ్లీ, గంభీర్‌లు గొడవపడ్డారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. కానీ, IPL 2024లో RCB, KKR (ఈ సీజన్‌లో గంభీర్ కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు) మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్‌లు ఒకరినొకరు హగ్ చేసుకొని తమ పాత గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
పెద్ద మనసు చాటిన గంభీర్
మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ పెద్ద మనసు చాటుకున్నాడు. కోహ్లీతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది తనే. గంభీర్ వెళ్లి కోహ్లీని కలిశాడు. కోహ్లీని పలకరించిన గంభీర్.. ఫ్యామిలీ ఎలా ఉంది, ఏం చేస్తున్నారంటూ మాట్లాడాడు. గంభీర్ పలకరింపుతో వీరిద్దరి మధ్య వివాదం ముగిసిపోయిందని టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నేటి నుంచి శ్రీలంకతో తొలి వన్డే
శ్రీలంకపై T20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన IND వన్డే పోరుకు సిద్ధమైంది. ఇవాళ తొలి వన్డే జరగనుంది. T20Iలకు రిటైర్మెంట్ ప్రకటన తర్వాత రోహిత్, కోహ్లీ మొదటిసారి ODI బరిలో దిగుతున్నారు. మరోవైపు వరుస ఓటములతో ఢీలాపడిన లంక ODIల్లోనైనా పుంజుకోవాలని ఆరాటపడుతోంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.