Mana Enadu:సాధారణంగా మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి రక్తం అవసరం ఏర్పడే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆస్పత్రుల్లో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో నుంచి బ్లడ్ తీసుకువచ్చి పేషెంట్‌కు ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఒకవేళ పేషెంట్ బ్లడ్ గ్రూప్‌నకు సెట్ అయ్యే రక్తం దొరకకపోతే తెలిసిన వాళ్లెవరిదైనా సరిపోలితే వారి నుంచి రక్తం సేకరించి ఎక్కిస్తారు. ఒకవేళ ఇదే పరిస్థితి పశువులకు వస్తే ఏం చేస్తారు? మనుషుల్లాగే పశువులకూ బ్లడ్ ఎక్కిస్తారా? ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంది కర్ణాటకలో.
ఏం జరిగిందంటే..?
కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో లాబ్రడార్ బ్రీడ్‌కు చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ శునకాన్ని తన ఇంటి సభ్యుడిగా భావిస్తుంది ఆ కుటుంబం. ఓ ఫ్యామిలీ మెంబర్లా ఆలనా పాలనా చూస్తుంటుంది. అయితే ఇటీవల ఆ కుక్క అస్వస్థతకు గురైంది. ఏమైందని పశువైద్య శాలకు తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ కుక్కను పరిశీలించిన వైద్యులు దానికి హిమోగ్లోబిన్ తక్కువైందని చెప్పారు. వెంటనే రక్తం ఎక్కించాలని లేకపోతే దాని ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. అయితే ఆ యజమానికి అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు.
ఎలాగైనా తన పెట్ డాగ్‌ను కాపాడమని డాక్టర్‌ను వేడుకున్నాడు. అప్పుడు పశువైద్యాధికారి బసవరాజ్ పూజర్‌కు తన పెంపుడు కుక్క గుర్తొచ్చింది. బసవరాజ్ కూడా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దానిపైరు భైరవ. అయితే అది డాబర్‌మన్ బ్రీడ్‌కు చెందినది. బసవరాజ్ తన శునకం బ్లడ్ గ్రూప్ పరిశీలించి.. పరీక్షించిన తర్వాత లాబ్రడార్‌కు దాని రక్తం ఎక్కించొచ్చని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే డాబర్‌మన్ నుంచి 300 మి.లీ. రక్తం సేకరించి తొమ్మిదేళ్ల లాబ్రడార్‌కు ఎక్కించారు. కొన్ని రోజుల్లోనే లాబ్రడార్ కోలుకుని మునపటిలా జాలీగా తిరుగుతోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు డాబర్మన్ను తెగ పొగిడేస్తున్నారు. తన తోటి కుక్కకు రక్తం ఇచ్చి కాపాడినందుకు థాంక్స్ చెబుతున్నారు. కుక్కలకు విశ్వాసంగా ఉండటమే కాదు.. సాయం చేయడమూ వచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…