హోటల్ స్టైల్​ పల్లి చట్నీ చేయాలా?.. ఈ టిప్స్ పాటిస్తే టేస్ట్ అదిరిపోద్ది

ManaEnadu:ఉదయం లేవగానే సౌత్ ఇండియన్స్​కు ముఖ్యంగా తెలుగువారికి (Telugu States) బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, దోశ ఏదో ఒకటి ఉండాల్సిందే. వాటిలోకి పల్లీల చట్నీ కచ్చితంగా ఉండాలి. చాలా మంది ఉప్మాలో కూడా పల్లీ చట్నీని తింటారు. తెలుగిళ్లలో పల్లీ చట్నీ (Palli chutney)కి డిమాండ్ ఎక్కువ. అయితే చాలా మంది హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అంటే బాగా ఇష్టపడతారు.

ఇంట్లో మహిళలు కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం హోటల్ స్టైల్ పల్లి చట్నీ తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితా చాలా సందర్భాల్లో హోటల్ స్టైల్ టేస్ట్ (Hotel Style Palli Chutney) రాక నిరాశ చెందుతుంటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి భంగపడ్డారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మేం చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ పల్లి చట్నీ చేస్తే హోటల్ స్టైల్ టేస్ట్ రావడం పక్కా.

మరి ఎలా చేయాలో చూద్దామా?
హోటల్​ స్టైల్​ పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇవే:
పల్లీలు – కప్పు, ఉల్లిపాయ – ఒకటి, నూనె – టేబుల్​ స్పూన్​, ఎండు మిర్చి – 7, అల్లం తరుగు – అర టీ స్పూన్​, టమాటా ముక్కలు – పావు కప్పు, చింతపండు – కొద్దిగా, వాటర్​ – సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – 7, ఉప్పు – రుచికి తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్​,

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు ఇవే :
ఆవాలు, జీలకర్ర – అర టీ స్పూన్​, పచ్చి శనగపప్పు – అర టీ స్పూన్​, నూనె – టేబుల్​ స్పూన్​, ఎండు మిర్చి – 1, కరివేపాకు – 2 రెమ్మలు,
హోటల్ స్టైల్ పల్లి చట్నీ ఇలా తయారు చేసుకోవాలి :
మొదట సన్నని మంటపై పల్లీ (Ground Nuts)లు వేయించుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టాలి. అదే గిన్నెలో టేబుల్ స్పూన్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కులు వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అందులోనే ఎండు మిర్చి, టమాట ముక్కులు (Tomatoes), అల్లం, జీలక్ర, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. టమాటలు మగ్గే వరకు సన్నని మంటపై ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలు, వేయించుకున్న ఉల్లిపాయ (Onions), టమాట మిశ్రమం వేయాలి. అందులోనే సరిపడా ఉప్పు, చింతపండు వేసి నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇక ఆ తర్వాత తాళింపు కోసం పాన్​లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ఒక నిమిషం తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కలపాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ (Hotel Style Palli Chutney Recipe) రెడీ. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

Related Posts

Heart Attack: గుండెపోటుకి ముందు కనిపించే సంకేతాలివే! వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత టెక్ యుగంలో గుండెపోటు(Heart Attack) అనేది వృద్ధులకే కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు(Eating habits), వ్యాయామం(Exercise) చేయకపోవడం, పని ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనూ గుండె సమస్యలు(Heart Problems) వస్తున్నాయి. చాలా మంది వ్యాధి వచ్చేలోపు గుర్తించలేక చివరికి ప్రాణాలు…

Kitchen Tips: వంటింటి ఖర్చులు ఇలా తగ్గించుకుందాం!

Mana Enadu : ధరలు(Price) ఎంతలా పెరిగిపోతున్నా.. నిత్యావసర సరుకుల(Essential commodities)ను కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. అయితే, చాలామంది తమ జీతం(Salary)లో ఎక్కువ మొత్తాన్ని ఇలా వంట సామగ్రి(cooking equipment)కే ఖర్చు చేస్తుంటారు. నెలకు సరిపడా వస్తువులను సరిగ్గా అంచనా వేయక,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *