ManaEnadu: మన ఆరోగ్యం(Health) మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. విటమిన్లు(Vitamins), ప్రోటీన్స్(Protins), కార్బోహైడ్రేట్లు(Carbohydrates), ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు ఇవి ఉండే ఆహార పదార్థాలను మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (Indian Council for Medical Research), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్(National Institute for Nutrition) అభివృద్ధి చేసిన డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ 2024(Dietary Guide Lines for Indians 2024) కీలక సూచనలు చేసింది. మనం తీసుకునే ఆహారంలో పండ్లు(Fruits), తాజా కూరగాయల(Vegetables)తో పాటు తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, మాంసాహారం, గుడ్లు(Eggs), నట్స్, పాలు(Milk), పెరుగు ఉండేలా చూసుకోవాలని సూచించాయి. ఈ పదార్థాల్లో ఏవో కొన్నింటిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తీసుకునే ఆహారంలో షేర్ చేసుకుని తినాలని తెలిపింది. ఎక్కువగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంది. చక్కెరతో కూడిన పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని.. ఇవి ఊబకాయం ముప్పును పెంచుతున్నాయని ICMR హెచ్చరించింది.
పెరుగుతో కలిపి వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం
చాలా మంది పెరుగును ఇష్టంగా తింటారు. భోజనం చివర్లో పెరుగుతో ముగించకపోతే కొందరికి తిన్నట్లు అనిపించదు. పెరుగు(Curd) కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు(Health professionals) సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
☛ చాలా మంది బిర్యానీ(Biryani)లో పెరుగు వేసుకొని తింటుంటారు. అయితే మసాలా ఎక్కువగా ఉండి, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పెరుగు వేసుకొని తింటే.. యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ సమస్య పెరగడం, గుండెల్లో మంట రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
☛ పెరుగన్నం తిన్న రెండు గంటల వరకు టీ లేదా కాఫీ(Tea or coffee) తీసుకోకూడదు. దీని వల్ల జీర్ణ ప్రక్రియ సరిగా జరగక కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. టీ, కాఫీలో ట్యానిన్లు, కెఫీన్లు పెరుగులోని పోషకాలను శరీరంగ గ్రహించకుండా అడ్డుకుంటాయి.
☛ సిట్రస్ పండ్లు(Citrus fruits) అయిన నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ, కివీ వంటి వాటిని పెరుగుతో కలిపి తీసుకోకూడదు. వీటిలో విటమిన్-C ఉంటుంది. పెరుగులో కాల్షియం ఉంటుంది. వీటిని కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే కాల్షియాన్ని శోషించుకోకుండా విటమిన్-C అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
మహిళలూ.. ఈ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు
☛ కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు నొప్పి వంటి కొన్ని వారాల పాటు తగ్గుకుండా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కొన్నిసార్లు అండాశయ క్యాన్సర్‌ను సూచిస్తాయి.
☛ రోజులో ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు కొన్నివారాల పాటు కొనసాగితే జాగ్రత్త పడాలి. చాలా మంది మలబద్ధకం అనేది ఎక్కువ కాలం ఉంటే ఆహారం తీసుకోవడంలో లోపాల వల్లే అనుకుంటారు. అయితే పైన పేర్కొన్న లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుని సలహాలు తీసుకోవాలి.
☛ పీరియడ్స్ ముందు, తర్వాత కూడా చాలా రోజులపాటు రక్తస్రావం ఎక్కువగా ఉంటే అది ప్రమాదంగా గుర్తించాలి.
అది కొన్నిసార్లు అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల(Cervical cancer)కు సంకేతం కావొచ్చు. ఈ సమస్య ఎక్కువ కాలం ఉంటే వెంటనే డాక్టరుని సంప్రదించాలి.
☛ కటి స్థానంలో నొప్పి కొన్ని నెలలపాటు వేధిస్తున్నా అశ్రద్ధ చేయవద్దు.
☛ ఒక్కసారిగా ఊహించని విధంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటిని కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టరుని సంప్రదించి వారి సూచనలను పాటించాలని ఐసీఎంఆర్ పలు కీలక సూచనలు చేసింది.