ManaEnadu: మంచి జరిగితే నోరు తీపి చేసుకోవాలనుకుంటారు. అందుకే బర్త్‌డే రోజు చాలామంది చాక్లెట్స్(Chocolates) పంచుతారు. పైగా చాక్లెట్స్‌ను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే వారు చిన్నపిల్లలు కాదన్న విషయాన్ని మర్చిపోయి మరీ వాటిని తింటుంటారు. అందుకే చాలా మంది అమ్మాయిలను ఇంప్రెస్(Impress) చేయడానికి, అలిగిన గర్ల్ ఫ్రెండ్స్(Girl friends)ను బుజ్జగించడానికి ఈ చాక్లెట్‌ను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. ఇంట్లో అన్నయ్య అలా బయటికెళ్తే చాలు ‘నాకో చాక్లెట్ తీసుకురా’ అని డిమాండ్ చేసే చెల్లాయిలు చాలా మందే ఉంటారు. రాఖీ రోజు తన సోదరుడు డబ్బులివ్వకపోయినా.. ఓ చాక్లెట్ ఇస్తే చాలనుకుంటారు. అలా నోట్లో వేసుకోగానే.. ఇలా కరిగిపోయే చాక్లెట్ గొంతులో కమ్మగా దిగిపోతుంది. ఈ మంచి అనుభూతిని అస్వాదించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.
వివిధ ఔషధ పద్ధతుల్లోనూ ఈ గింజలు వాడేవారు..
ఈ చాక్లెట్స్‌ను కోకో గింజలతో తయారు చేస్తారు. వీటిని తొలిసారిగా మెసో అమెరికా(America)లో పండించారు. వీటిని అప్పట్లో పానీయాల రూపంలో సేవించేవారట. వివిధ ఔషధ పద్ధతుల్లోనూ ఈ గింజలని వాడేవారట. అప్పట్లో అది చేదుగా ఉన్నా ఇప్పుడు అదనంగా పలు ఫ్లేవర్స్(Many flavors) కలపడం వల్ల రుచి తీయగా మారింది. చాక్లెట్ తినడం వల్ల కిలిగే ప్రయోజనాల(benefits) గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ డేను జరుపుకొంటున్నాం. చాక్లెట్ తింటే పళ్లు పుచ్చిపోతాయని చిన్నప్పుడు మన అమ్మనాన్నలు(parents) చెప్పేవారు. కానీ ఈ చాక్లెట్ ఆరోగ్యపరం(Health)గా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. మానసిక ఒత్తిళ్ల(Psychological stress)ను తగ్గించే క్రమంలో ఈ చాక్లెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు(Docters) చెబుతున్నారు. ఇది మెదడులో సెరటోనిన్ హార్మోన్(Serotonin hormone) స్థాయులను పెంచి మనసులో ఆందోళనను దూరం చేస్తుంది. అందుకే చాక్లెట్ తినేవారిలో డిప్రెషన్ లెవల్స్(Depression levels) మిగితావారితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. చాక్లెట్‌లో ఉండే ‘ఎల్-ఆర్జినైన్(L-arginine)’ అనే ఆమ్లం స్త్రీ పురుషుల్లో లైంగిక కోరికల్ని పెంచుతుంది. ఇవి అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడటమే కాకుండా.. చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. చెడు కొవ్వును తగ్గిస్తాయి. గర్భిణులు రోజుకు 30 గ్రాముల చాక్లెట్ తింటే పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది.
పేర్లు వేరైనా రుచి ఒక్కటే..
చాక్లెట్‌లో ఎన్ని రూపాలున్నా, ఎన్ని ఫ్లేవర్లున్నా చాక్లెట్‌ను చాక్లెట్‌గానే ఇష్టపడేవారి సంఖ్యే చాలా ఎక్కువట. అది చిన్న రూపాయి చాక్లెట్ అయినా, కాస్లీ డార్క్ చాక్లెట్ అయినా దాని రుచి ఒకేలా ఉంటుందని భావించేవారు చాలా మంది ఉన్నారు. అయితే చాక్లెట్స్ రుచి, నాణ్యతే కాకుండా.. కొన్ని చాక్లెట్ బ్రాండ్‌ల ఆడ్స్ ప్రత్యేకంగా నిలిచాయి.
☛ డెయిరీ మిల్క్(Dairy milk)- ‘కిస్ మీ.. క్లోజ్ యువర్ ఐస్, అండ్ మిస్ మీ..’ అంటూ సాగే సంగీతం, ఆడ్‌లో వారు చాక్లెట్‌ను తింటూ ఆస్వాదిస్తున్న విధానం.. ఇవన్నీ చూస్తుంటే మనకూ నోరూరుతుంటుంది. ‘ఎప్పుడైనా ఇతరుల సంతోషాలను పంచుకొని చూడండి’, ‘తియ్యని వేడుక చేసుకుందాం’ అంటూ వచ్చే మాటలు వినగానే అందరికీ ఈ డెయిరీ మిల్క్ చాక్లెటే గుర్తువస్తుంది.
☛ ఫైవ్ స్టార్(5Star)- అప్పట్లో ఈ చాక్లెట్ కన్నా ‘రమేశ.. సురేశ్’, ‘మా డాడీ ప్యాంట్ ఓ జానెడు కట్ చేయమన్నాడు’ అని వచ్చే టెలివిజన్ ప్రకటనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు కూడా ‘ఎప్పుడైనా ఏం చేయకుండా కూడా చూడండి, ఈట్ ఫైవ్ స్టార్- డూ నథింగ్’ అనే ప్రకటన కూడా చాలా మందిని ఆకట్టుకుంటుంది.
☛ ఆశా చాక్లెట్(Asha Chocolate)- 90’s కిడ్స్‌కి ఇది బాగా తెలిసిన పేరు. ఈ తెలుగు బ్రాండ్ చాక్లెట్స్‌ను అప్పట్లో చాలా మంది ఎంతో ఇష్టంతో తినేవారు. ఇప్పుడు అవి కనుమరుగైపోయినా.. ఇప్పటికీ వాటిని గుర్తు చేసుకునేవారు చాలా మంది ఉన్నారు.
చాక్లెట్ గురించి ఈ విషయాలు తెలుసా..
అప్పట్లో కోకో గింజల్ని డబ్బుకు బదులుగా ఉపయోగించేవారు. బహుమతుల రూపంలోనూ వీటిని పంచుకునేవారు. వస్తు సేవల కోసం వర్తకం చేసేవారు.
✦ చాలా మంది వైట్ చాక్లెట్‌ను ఎంతో ఇష్టంతో తింటుంటారు. వాస్తవానికి అది అసలు చాక్లెటే కాదు.
✦ 18వ శతాబ్దంలో క్షయవ్యాధి నిర్మూలనకు చాక్లెట్‌ను వినియోగించేవారట.
✦ చాక్లెట్ దాదాపు 34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. మన శరీర ఉష్ణోగ్రత అంతకన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాలుకపై పెట్టగానే కరగడం ప్రారంభమవుతుంది.
✦ చాక్లెట్స్ తయారయ్యే కోకో బీన్స్(cocoa beans)లో చాలా కీటకాలు ఉంటాయి.
✦ 2011లో 5,792 కిలోల అతిపెద్ద చాక్లెట్ బార్‌ను యూకేలో తయారుచేశారు.
✦ అప్పట్లో కోకో బీన్ ధర బంగారం కన్నా ఎక్కువగా ఉండేదట.
✦ ఒక పౌండ్ చాక్లెట్ తయారుచేయడానికి 400 కోకో బీన్స్ కావాలి.
✦ 1728లో మొట్టమెదటి చాక్లెట్ ఫ్యాక్టరీని యూకేలో స్థాపించారు.
✦ తొలిసారి చాక్లెట్ బార్‌ను 1847లో తయారుచేశారు.
✦ మనం తినే చాక్లెట్స్ తియ్యగా ఉన్నప్పటికీ.. కోకో గింజలు మాత్రం చేదుగా ఉంటాయి.
✦ కోకో చెట్లు 100 సంవత్సరాల వరకు జీవించగలవు.
✦ అసలైన చాక్లెట్ వాసన మనసుకు, శరీరానికి విశ్రాంతి కావాలని సూచిస్తుందట.
✦ చాక్లెట్ అనే పదం xocoatl అనే పదం నుంచి వచ్చింది.
✦ 1821లో చాక్లెట్ రంగును అధికారికంగా ప్రకటించారు.
✦ చాక్లెట్ తినేటప్పుడు అది అయిపోతుందని భయపడటాన్ని ‘చోకోలిజం’ అని అంటారు.