Mana Enadu:పాన్ ఇండియా రెబల్ స్టార్ (rebal star) ప్రభాస్, టాలెండెట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(naag ashwin) కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD). ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. అందుకు తగ్గట్లుగా ప్రీమియర్స్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకుందీ మూవీ. దీంతో బాక్సాఫీస్(Box office) వద్ద ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా కల్కి 2898 ఏడీ నిలిచింది.
మరో రూ. 55 లక్షలు రాబడితే..
ఇక ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన ‘బాహుబలి2′(bahubali-2),’KGF-2’, ‘RRR’, ‘జవాన్'(jawan) తర్వాత 5వ స్థానంలో ‘Kalki 2898Ad’ ఉంది. అంతేకాదు మరో రూ. 55 లక్షలు రాబడితే 4వ స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’ను కూడా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ దాటేయనుంది. ‘జవాన్’ మూవీ ఫుల్ రన్‌టైంలో రూ. 640.25 కోట్లు వసూల్ చేయగా.. కల్కి ఇప్పటి వరకు రూ. 639.70 కోట్లు కొల్లగొట్టింది. ఇందులో అధిక భాగం (రూ.414.85కోట్లు) మొదటి వారంలోనే వచ్చాయని మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటిచింది. ఆగస్టు 15 వరకు ‘కల్కి..’ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే జవాన్ రికార్డు బ్రేక్ చేయనుంది.
పదుల సంఖ్యలో స్టార్లు..
ఈ మూవీలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణే, దిశా పటానీ కీ రోల్‌లో పోషించారు. గెస్ట్ రోల్‌లో SS రాజమౌళి, రాంగోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు స్రీన్‌పై కనిపించి సందడి చేశారు.