స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం గోవాలో ఘనంగా జరిగింది. మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఈ ప్రేమ జంట. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్ లో జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
Rakul Preet – Jackky Bhagnani Wedding: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం గోవాలో ఘనంగా జరిగింది. మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఈ ప్రేమ జంట. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో (Jackky Bhagnani) గోవాలోని ఓ రిసార్ట్ లో జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రకుల్ భగ్నానీ జంట గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లికి సంబంధించి ఫొటోలు వైరల్ గా మారాయి.