Mana Enadu: భాగ్యనగరంలోని రామంతాపూర్ లోని గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో ఇద్దరు మెడికల్ విద్యార్థినిలు తీవ్రంగా గాయపడ్డారు. రామంతాపూర్ లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిలపై పడ్డాయి. ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…