మాన్ సూన్ లో ఊటీ అందాలు చూసొద్దామా? .. మీ బడ్జెట్ లోనే IRCTC ప్యాకేజ్

Mana Enadu:సన్నని చిరుజల్లులు కురుస్తుండగా.. పచ్చదనమంతా పచ్చని తోరణంలా పరుచుకున్న ప్రకృతిలో.. ఎత్తైన కొండల మధ్య.. ఏ బస్సు కిటికీ పక్కన సీట్లోనో.. లేక రైల్లో విండ్ సీట్ లోనో కూర్చొని ఊటీలో విహరిస్తే ఉంటుంది.. ఆహ్.. ఊహించడానికే అద్భుతంగా ఉంది కదూ. మరి ఈ అద్భుతాన్ని ఆస్వాదించాలంటే ఈ వర్షాకాలంలో హాయిగా ఊటీలో సేదతీరాల్సిందే. మీలాంటి వారి కోసమే తక్కువ ధరలో ఊటీ అందాలు చుట్టేసి వచ్చేందుకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ బ్రహ్మాండమైన ప్యాకేజీని ప్యాకేజీని అందిస్తోంది.  ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? వివరాలు తెలుసుకుందామా..?

ప్యాకేజ్ వివరాలు ఇవే.. 

“అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది.
ప్రతి మంగళవారం హైదరాబాద్​ నుంచి ట్రైన్ ద్వారా జర్నీ ఉంటుంది. ఈ టూర్‌ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. 
DAY- 1 : తొలిరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17230) ఉంటుంది. 
DAY- 2 : మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ చేరుకున్న తర్వాత.. అక్కడ నుంచి ఊటీకి ఐఆర్‌సీటీసీ సిబ్బంది తీసుకెళ్తి ముందుగా బుక్‌ చేసుకున్న హోటల్​లో చెకిన్​ అవ్వాలి.
సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు చూడొచ్చు. 
DAY- 3 : మూడో రోజు ఉదయం హోటల్‌లోనే బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత దొడబెట్ట పీక్‌, టీ ఫ్యాక్టరీ, పైకారా వాటర్ ఫాల్ సందర్శించొద్దు.
DAY- 4 : నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసి కూనూర్‌ పర్యటనకు వెళ్తారు. అక్కడి టీ ఎస్టేట్స్ చూసి తిరిగి సాయంత్రం ఊటీకి చేరుకుంటారు.
DAY- 5 : ఐదో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్​ ​చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్‌ వెళ్లి కోయంబత్తూర్​ రైల్వే స్టేషన్​ నుంచి సాయంత్రం 03:55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెం:17229) హైదరాబాద్​కు బయల్దేరుతుంది. 
DAY- 6 :ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్​ సమాప్తమవుతుంది.

ఇక ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయంటే..

థర్డ్‌ ఏసీ బెర్త్‌ లో ఒక్కో ప్రయాణికుడికి.. సింగిల్ షేరింగ్​కు రూ.28,940, టూ షేరింగ్‌కు రూ.16,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,380 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5 – 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,100, విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,850.
స్లీపర్‌ బెర్త్‌ సింగిల్ షేరింగ్​కు రూ.26,480, ట్విన్ షేరింగ్‌కు రూ.13,980, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,930. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.6,640, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,400 చెల్లించాలి. 
ప్రస్తుతం ఈ టూర్​ సెప్టెంబర్​ 24వరకు అందుబాటులో ఉంది.

 

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

SCR: ప్రయాణికులకు ఊరట.. 48 స్పెషల్ ట్రైన్స్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త అందించింది. ఇటీవల రైళ్ల రద్దు, దారి మళ్లింపు, స్టేషన్ల పునర్మిణానం, మూడో లైన్ పనులు, ఇతర స్టేషన్లనుంచి రాకపోకలు అంటూ ప్రయాణికులను(Passengers) విసిగించిన రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రయాణికులకు కాస్త…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *