Mana Enadu:మారుతున్న జీవనశైలికి అనుగుణంగానే మనం తీసుకునే ఆహారం(food) కూడా మారుతోంది. ఫలితంగా ఎక్కువగా షుగర్, కొవ్వు(fat)తో కూడిన ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నాం. దీని వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఆరోగ్య సమస్య(health isses)ల నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు(tips) పాటించడం తప్పనిసరి.
వీటిని గాడిలో పెట్టుకుంటేనే..
ఆహారం, వ్యాయామం(exercise), నిద్ర, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. వీటిని గాడిలో పెట్టుకుంటూ వెళ్తే దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయి. మనలో చాలా మంది ఎలాగైనా వ్యాయామం చేయాలని వారంలో రోజుకు 30-40 నిమిషాలు నడిచి కొద్ది రోజులకు ఏదో ఒక వంకతో ఆపేస్తారు. ఇలా కాకుండా వారం పాటు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అది చేరుకున్నాక.. రెండోవారం మరికొంత సమయం పెంచుకొని దాన్ని అందుకునేలా చూడాలి. మధ్యలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ మీరు అనుకున్న లక్ష్యం వైపుగా సాగాలి.
ఈ అలవాట్లను మర్చిపోవద్దు..
☛ ఆహారం విషయంలోనూ అంతే. ఎక్కువ చక్కెర, ఉప్పు, అధిక కొవ్వు ఉన్న జంక్ ఫుడ్‌కు అలవాటు పడితే వాటిని వెంటనే మానేయడం కష్టమవుతుంది. అందుకే క్రమేణా ఈ అలవాటు నుంచి బయటపడాలి. రోజూ తీసుకునే వాటిని మొదటి వారంలో రెండు రోజులు, తర్వాత వారంలో ఒక రోజుకు పరిమితం చేయాలి. తర్వాత నెల, రెండు నెలలకు ఒకసారి స్వల్ప మోతాదులో తింటూ నెమ్మదిగా ఈ అలవాటును దూరం చేసుకోవాలి.
☛ బరువు విషయంలోనూ తక్కువ సమయంలోనే తగ్గాలనే క్రాష్ డైటింగ్ చేసే కన్నా.. ఫిట్నెస్ ట్రైనర్ సూచనలతో సరైన డైట్ తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ బరువు తగ్గడం మంచిది.
☛ ధూమపానం అలవాటు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఆపేయాలి. ధూమపానాన్ని ఆపేసిన ఒక ఏడాది వ్యవధిలో దానివల్ల ఎదురయ్యే ముప్పు 50 శాతానికి తగ్గిపోతుంది.
☛ సరిగా నిద్ర లేకపోతే దాని ప్రభావం మొత్తం మన దినచర్యపై పడుతుంది. పనిపై దృష్టి పెట్టలేం. కీళ్లు, కండరాలు, ఒళ్లు నొప్పులు వేధిస్తుంటాయి. అందుకే రోజుకు 8 గంటలపాటు నిద్రపోవడం మంచిది.

వాతావరణ మార్పుల ప్రభావం
వాతావరణంలో జరుగుతున్న మార్పులు మన ఆరోగ్యం(health)పై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా మెదడుపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మార్పుల కారణంగా అల్జీమర్స్, మూర్ఛ, పక్షవాతం, పార్శ్వనొప్పి ఇతర నాడీ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తున్నట్లు వెల్లడైంది. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం కాసేపు వాకింగ్, జాగింగ్ వంటివాటితోపాటు యోగా, ఎక్సర్సైజ్(exercise) చేయడం బెటర్. మరెందుకు ఆలస్యం మీ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని పార్టుగా చేసుకోండి.. మంచి ఆరోగ్యాన్ని పొందండి.









