మన ఈనాడుః ప్రజల కోసం నిలబడిన..పోరాడినా కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాత్రమేనని..అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రజెండాకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఉందని సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు.సిపిఐ(ఎం) పార్టీ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.చింతకాని మండలంలోని వందనం,కొదుమూరు,లచ్చగూడెం, రాఘవాపురం, నేరడ,చింతకాని,నరసింహపురం,కోమట్లగూడెం,ప్రొద్దుటూరు గ్రామాల్లో అభ్యర్ధి పాలడుగు భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం చట్టసభల్లో సామాన్యుని గొంతును అసెంబ్లీలో వినిపించేందుకు పోరాటాల నాయకుడు పాలడుగు భాస్కర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ బిజెపితో దోబూచులాడుతుందని బిజెపి వ్యతిరేక పోరాటంలో కేసీఆర్ కలిసి రావడం లేదన్నారు. మతం పేరుతో బిజెపి దేశంలో చేస్తున్న అరాచకాలకు అడ్డు లేదన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ఊసరవెల్లిలా పార్టీలు మార్చే బిఆర్ఎస్ అభ్యర్ధి లింగాల కమల్ రాజును, మధిర లో మూడు సార్లు గెలిచి ఉన్నత పదవులు అనుభవిస్తూ స్వంత ప్రయోజనాల కోసం మధిర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో మధిర ను ఉంచిన మల్లు భట్టి విక్రమార్కలను ఓడించి ప్రజా సమస్యల పరిష్కారం నిత్యం పోరాడే పాలడుగు భాస్కర్ సుత్తికొడవలి నక్షత్రం గుర్తు పై ఓటువేసి గెలిపించాలన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల పక్షాన పోరాడే కార్మిక కర్షక పక్షపాతి పాలడుగు భాస్కర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలన్నారు. పార్టీ అభ్యర్ధి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మధిర సమగ్రాభివృద్దే నా ధ్యేయం అని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం డబ్బు సంచులతో వచ్చే వారిని ఓడించి ప్రజా సమస్యలపై పోరాడే తనను గెలిపిస్తే నియోజకవర్గ సమగ్ర అభివద్ధి చేస్తానని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానన్నారు. ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న తనను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజా గొంతుక నవుతానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సామినేని రామారావు మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, చింతకాని సహకార సంఘం ఉపాధ్యక్షులు మాదినేని రవి, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, రాచబంటి రాము ,గడ్డం రమణ ,నన్నక కృష్ణమూర్తి ,దేశ బోయిన ఉపేందర్, కాటాబత్తిని వీరబాబు, మద్దిన్ని బసవయ్య, పులి యజ్ఞ నారాయణ, పంగా గోపయ్య, కిరణ్ బాబు, గడ్డం కోటేశ్వరావు, పొట్ల కోటేశ్వరరావు, మేకపోతుల శ్రీను, జానీ మియా పాల్గొన్నారు.
Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
–నరేష్ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…