Mana Enadu: బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్(IND vs NZ) మధ్య జరుగుతున్న తొలి టెస్టు(1st Test) ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఇవాళ నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ బ్యాటర్లు మార్నింగ్ సెషన్‌లో కివీస్ బౌలర్ల(Kiwis bowlers)పై ఎదురుదాడికి దిగారు. 231/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (114*: 133 బంతుల్లో 16×4, 3×6) టెస్టుల్లో తొలి శతకం బాదేశాడు. దాంతో టీమిండియా(Team India) ప్రస్తుతం 344/3తో కొనసాగుతోంది. సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)తో పాటు రిషభ్ పంత్(Rishabh Pant) 53* పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో వరుణుడు ఆటకు ఆటంకం కలిగించాడు. భారత్ ఇంకా 12 పరుగులు వెనుకబడి ఉంది.
https://twitter.com/ktchandra2/status/1847530001999995234
భారీ టార్గెట్ సెట్ చేస్తారా?
అంతకుముందు తొలి ఇన్నింగ్స్(1st Innings)లో రోహిత్ సేన కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. బదులుగా కివీస్ 402 పరుగులు చేసింది. దాంతో 356 పరుగుల లోటుతో 2వ ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ జట్టు ఇంకా 12 పరుగులు వెనకబడి ఉంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసిన వారంతా ఈ మ్యాచ్‌లో మన జట్టుకి ఓటమి ఖాయమేనని భావించారు. కానీ సర్ఫరాజ్, పంత్ ఎటాకింగ్ గేమ్ ఆడటంతో కివీస్ బౌలర్లు తేలిపోయారు. ప్రస్తుతం టీమ్ఇండియా ఎంత టార్గెట్ న్యూజిలాండ్(New Zealand)కి ఇస్తుందోననేది ఆసక్తిగా మారింది. కాగా పిచ్ చివరి రోజు స్పిన్నర్ల(Spinners)కు అనుకూలించే ఛాన్స్ ఉన్నందున 250+ టార్గెట్ ఇస్తే భారత్ గెలిచే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి భారత బ్యాటర్లు ఏం చేస్తారో
RISHABH PANT AND TEST CRICKET IS A MATCH MADE IN HEAVEN….!!!! ❤️ pic.twitter.com/n8zReUAGVP
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024