ManaEnadu: కొందరు ఆఫీసు(Office)కు లేట్ అవుతోందని, సమయం(Time) లేదని ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా తరచూ చేసేవారికి భవిష్యత్తు(Future)లో అనేక ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్యులు(Doctors) హెచ్చరిస్తున్నారు. తరచూ తిండిని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో గ్లూకోజ్ తగ్గి నీరసం, అలసట, చికాకు పెరుగుతాయి. ఇది మెదడు(Brain)పై కూడా ప్రభావం చూపి చేసే పనిపై ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి లోపించడం(Memory loss) వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలా తిండిని పక్కనపెట్టడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. తరచూ ఓ పూట తిండి మానేసేవారిలో క్రమంగా కండరాలు క్షీణిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సమయానికి తినకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్(Cortisol hormone) స్థాయి పెరిగి చిరాకు, ఆందోళన ఎక్కువవుతాయని హెచ్చరిస్తున్నారు.
ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చాలా మంది ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేస్తారు. ఇలా సరిగా నమలకుండా ఆహారాన్ని మింగేస్తే జీర్ణవ్యవస్థ(digestive system)పై మరింత ఒత్తిడి పడుతుంది. చక్కగా నమిలి తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మనకు ఆకలిగా ఉన్నప్పుడే తినాలి కానీ ఇతరులు పిలిచారనో, ఇతర కారణాలతోనో తింటే జీర్ణప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. TV చూస్తూ, పుస్తకం చదువుతూ, PHONE, ల్యాప్‌టాప్ చూస్తూ భోజనం చేయకూడదు. దీని వల్ల తిన్న ఆహారం ఒంటికి పట్టదు. అందుకే ప్రశాంతంగా కూర్చొని ఆహారంపైనే దృష్టి పెట్టి తినాలి. ఒకరోజు ఎక్కువగా, మరోరోజు తక్కువగా తినడంవల్ల జీర్ణప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకుండా రోజూ(Daily) ఒకేలా శరీరం అవసరం మేరకు తినాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడు తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తింటే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అజీర్తి సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు.
పెరుగుతో వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం
చాలా మంది పెరుగు(Curd)ను ఇష్టంగా తింటారు. భోజనం చివర్లో పెరుగుతో ముగించకపోతే కొందరికి తిన్నట్లు అనిపించదు. పెరుగు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది బిర్యానీలో పెరుగు వేసుకొని తింటుంటారు. అయితే మసాలా ఎక్కువగా ఉండి, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పెరుగు వేసుకొని తింటే.. యాసిడ్ రిఫ్లెక్స్(Acid reflex), గ్యాస్ సమస్య పెరగడం, గుండెల్లో మంట రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. పెరుగన్నం తిన్న రెండు గంటల వరకు Tea లేదా Coffee తీసుకోకూడదు. దీని వల్ల జీర్ణ ప్రక్రియ సరిగా జరగక కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. టీ, కాఫీలో ట్యానిన్లు, కెఫీన్లు పెరుగులోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.