TEA, COFFEE: ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా?

Mana Enadu: మనలో చాలామందికి ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే టీ లేదా కాఫీ(Tea or Coffee) తాగనిదే రోజు మొదలవదు. అయితే, ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపు(empty stomach)తో కాఫీ, టీలు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు(Docters) చెబుతున్నారు. ఉదయాన్నే పరిగడుపున టీ, కాఫీలు తాగితే ఎసిడిటీ(Acidity), గుండెల్లో మంట, గ్యాస్, డీహైడ్రేషన్(Dehydration) వంటి సమస్యలు వస్తాయి. నోటిలోని ఎనామిల్ దెబ్బతిని, పళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిని తాగడం వల్ల శరీరంలో కెఫీన్(Caffeine) మోతాదు పెరిగి మానసిక సమస్యలు వస్తాయి. పొద్దున్నే బెడ్ కాఫీ, టీలు తాగడం వల్ల నోట్లోని చెడు బ్యాక్టీరియా పేగుళ్లోకి వెళ్లి జీర్ణశయ సమస్యలు వస్తాయి. రాత్రిళ్లు వీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అయితే, వ్యాయామం(exercise)చేసే ముందు వీటిని సేవిస్తే ఇన్‌స్టంట్ ఎనర్జీతో పాటు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇంకా పొద్దున్నే టీ, కాఫీలను తాగాలనుకుంటే ఏదైనా తిన్న తర్వాత తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

 ఆరోగ్యానికి తులసి
తులసి చెట్టు సాధారణంగా అందరి ఇళ్లలో ఉంటుంది. అయితే దీనిని పూజించడానికే కాకుండా దీని ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్(Antioxidants), యాంటీ ఇన్‌ఫ్లమేటరి గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇవి ఎలాంటి జబ్బులను దరి చేరనీయవు. ఆకులను తినడం లేదా తులసి నీటిని ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌(bad cholesterol) ను నివారిస్తుంది. కాలేయం, చర్మం, మూత్రపిండాలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది. క్యాన్సర్ రెసిస్టెంట్‌(Cancer resistant)గా కూడా పని చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. రక్తపోటుకు, జలుబు, దగ్గు వంటివే కాక ఇంకా ఇతర రుగ్మతలకు కూడా మంచి ఔషదంగా పనిచేస్తుంది.

బిర్యానీ తిన్న తర్వాత అధిక దాహం ఎందుకంటే
బిర్యానీ(Biryani) తినాలంటే కచ్చితంగా దాంతో పాటు కూల్‌డ్రింక్స్(Cooldrinks) ఉండాల్సిందే. బిర్యానీ తిన్న తర్వాత దాహం అధికంగా వేస్తుంది. దానిని తగ్గించుకోవడానికి చాలామంది కూల్‌డ్రింక్స్, సోడా లేదా నీళ్లను తీసుకుంటారు. అయితే ఈ దాహం అంత సులభంగా తీరదు. మనం తినే ఆహారంలో కొవ్వు(Fat), నూనె, ఉప్పుశాతం ఎక్కువగా ఉన్నప్పుడు దాహం ఎక్కువగా వేస్తుంది. ఆహారంలోని కొవ్వులు కరగడానికి అధిక సమయం పడుతుంది. శరీరంలోని ఉప్పు(Salt)ని బ్యాలెన్స్ చేయడానికి శరీరానికి నీరు అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే వరకు దాహం వేస్తూనే ఉంటుంది. బిర్యానీలో ఆయిల్, ఉప్పు ఇంకా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల బిర్యానీ తిన్న తర్వాత దాహం ఎక్కువగా ఉంటుంది.

 

Share post:

లేటెస్ట్