రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సెషన్స్.. హాజరుకానున్న కేసీఆర్?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) రేపటి నుంచి (మార్చి 12) ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ప్రసంగిస్తారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహిస్తారు? బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారు? తదితరాలను నిర్ణయిస్తారు.అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం KCR హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 17 లేదా 19న బడ్జెట్‌

ఇక 13న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, 14న హోలీ(Holi) సందర్భంగా అసెంబ్లీకి సెలవు, 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం ఉంటాయి. ఈ సమావేశాల్లోనే SC వర్గీకరణ, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో BCలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను CM రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఇక ఈనెల 17 లేదా 19న సర్కార్ సభలో 2025-26 ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Telangana Budget 2024 Highlights | Sakshi Education

నేడు కేసీఆర్ అధ్యక్షతన BRSLP భేటీ

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు KCR హాజరుకానున్న నేపథ్యంలో BRSLP సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మంగళవారం మధ్యహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై BRS MLAలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కాగా సభకు కేసీఆర్ రానున్న ఈ నేపథ్యంలో ఈ దఫా సమావేశాలు హాట్ హాట్‌గా సాగే అవకాశం ఉంది.

Related Posts

Rains: వరుణుడు ఉప్పెనై.. వీధులు ఏరులై.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం

తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన…

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *