
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పార్టీ మంత్రులు, MLAలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ సభాపక్షం (CLP) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం స్కీం(Sanna Biyyam Scheme) ఒక అద్భుతమని, ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని దీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందాలి
సీఎం ఇంకేమన్నారంటే.. ‘‘భూ భారతిని(Bhu Bharathi) రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Illu) పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం. SC ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
BJP, BRS కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం
ఇక రేపటి నుంచి జూన్ 2 వరకు MLAలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకమవుతానని చెప్పారు. ‘‘ HCU భూములపై ప్రతిపక్షం AIతో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని PM మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు. BJP, BRS కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
దేశంలోనే తెలంగాణ ఒక మోడల్
అలాగే ‘‘ప్రతి మంత్రి, ఎమ్మెల్యే మీమీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోవాలని, ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా PM మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది. దేశంలో తెలంగాణ మోడల్(Telangana Model)పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే BJP, BRS ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్నబియ్యం మన పథకమే మన పేటెంట్,మన బ్రాండ్’’ అని సీఎం అన్నారు.
#WATCH | Telangana Chief Minister Revanth Reddy attended the CLP meeting in Hyderabad today.
At the meeting, he said, “It is the responsibility of everyone to reach out to people and explain the important decisions taken by the government. MLAs should visit every village in… pic.twitter.com/epFfTHoCUx
— ANI (@ANI) April 15, 2025