బలమైన దళిత నేత.. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు.. భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానమిదే..

కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. తెలంగాణ రాజకీయాల్లో పేరున్న నాయకుడు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది.

కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. తెలంగాణ రాజకీయాల్లో పేరున్న నాయకుడు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది. ఈ సాన్నిహిత్యం వల్లనే ఆయన కాంగ్రెస్‌ హయాంలో 2009-11 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్‌ విప్‌‌గా, 2011-14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌ వంటి కీలక పదవులను కూడా చేపట్టారు. వైఎస్సార్‌ని రాజకీయ గురువుగా భావించే భట్టి విక్రమార్క.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం ఇలా..
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.. 2007-09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో చీఫ్ విప్‌గా, 2011 జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై సేవలు అందించారు. ఇక 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా మరోసారి అదే స్థానం నుంచి పోటీ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేతగా కూడా భట్టి విక్రమార్క ఎన్నికైన విషయం తెలిసిందే. ఆప్పటి నుంచి కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా వ్యవహరిస్తోన్న భట్టి విక్రమార్క.. పార్టీలో బలమైన దళిత నేత. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకుల్లో భట్టి విక్రమార్క కూడా ఒకరు.

17 జిల్లాల్లో పాదయాత్ర..
2023 మార్చి 16న ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్​ మార్చ్’ పేరిట​పాదయాత్ర ప్రారంభించి.. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలోమీటర్లు పూర్తి చేశారు మల్లు భట్టి విక్రమార్క. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తన పాదయాత్ర ముగింపులో భాగంగా 2023 జులై 2న రాహుల్‌ గాంధీ ముఖ్య అతిధిగా జన గర్జన సభను నిర్వహించారు.

 

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *