మన ఈనాడు: ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బండి సంపత్‌గౌడ్ నియామకం అయ్యారు. మర్రిగూడకు చెందిన సంపత్‌గౌడ్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఉప్పల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్‌కుమార్ పటేల్ సూచించారు. అంతకముందు నియామక పత్రాన్ని అందజేశారు.
సంపత్ గౌడ్ మాట్లాడుతూ ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి నాయకత్వంలో మల్లాపూర్ డివిజన్ లో యూత్ కాంగ్రెస్ పటిష్టతకై అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షుని పదవికి సహకరించిన మల్లాపూర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ , ఉప్పల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కోయలకొండ రాజేష్, ముదిగొండ లింగంకు ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు.