మన ఈనాడు:తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ కు ఆ పార్టీ షాకిచ్చింది. గత ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి గంగుల కమలాకర్ తో కుమ్మక్కై పార్టీ ఓడిపోయేలా చేశారంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ అందించిన నిధులను ఖర్చు చేయకపోవడంతో పాటు భారాస, భాజపా అభ్యర్థులకు సహకారం అందించారని.. ప్రచారానికి ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ఏఐసీసీ ప్రముఖులు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కనీస సమాచారం అందించలేదని పేర్కొంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించడం గమనార్హం. అయితే ఈ స్థానంలో కొన్ని సామాజిక వర్గాల ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థి, భారాస అభ్యర్థి గంగుల కలిసి పథకం పన్నారంటూ భాజపా అభ్యర్థి బండి సంజయ్ ఫలితాల విడుదల రోజునే ఆరోపించారు.
గత పదేళ్ల సంక్షేమాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి: KCR Tweet
భోగి, సంక్రాంతి(Bhogi, Sankranti) పండుగలను పురస్కరించుకొని తెలంగాణ మాజీ సీఎం, BRS అధినేత KCR ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతన్న(Farmers) జీవితాల్లో వెలుగులు కొనసాగాలని, పండిన పంటలతో అన్నదాతల ఇళ్లు కళకళలాడాలని ఆకాంక్షించారు. నూతన తెలంగాణ(Telangana) రాష్ట్రంలో వ్యవసాయం(Agriculture) పండుగ కావాలని,…