Parenting Advice: మీరూ మీ పిల్లలపై ఇలాగే ప్రవర్తిస్తున్నా? జాగ్రత్త!

Mana Enadu: ఏ తల్లిదండ్రులైనా పిల్లలన్నాక ముద్దుచేస్తారు. గారాలు పోతుంటే మురిపెంగా చూస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే మీ పిల్లలపై మీరు చూపించే ప్రేమాభిమానములు ఎంతో విలువైనవి. వారి చిలిపి చేష్టలూ వెలకట్టలేనివి. కానీ ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లితండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు ఏంటంటే ‘నేను పడే కష్టం, నా బిడ్డ పడకూడదు’ ఇది తల్లితండ్రుల ప్రేమ. కానీ ఇక్కడ కాస్త అటూఇటూగా ఉంటే పిల్లలను పెడదారిన పట్టే ప్రమాదముంది. పిల్లలను అక్కున చేర్చుకోవాలి. అచ్చటా ముచ్చటా తీర్చాలి. కానీ ప్రేమ వేరు, గారాబం వేరు. మంచి మార్కులు తెచ్చుకుంటే లేదా తోటి పిల్లలకు సాయం చేస్తే మెచ్చుకోండి. ప్రేమ కురిపించిండి. కానీ ఎవరినైనా గేలి చేసినా, కటవుగా మాట్లాడిన అది తెగువ, ధైర్యం కాదు. చిన్నతనంలోనే ఇలాంటి వాటిని కట్టడి చేయాలని చిల్డ్రన్ స్పెషలిస్టు నిపుణులు సూచిస్తున్నారు.

అతి జోక్యం వద్దు

అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవుకోవాలి. మంచి ఉద్యోగం సాధించాలి. జీవితంలో అన్నివిధాల సెటిల్ అవ్వాలి అని ప్రతీ పేరెంట్‌ కోరుకుంటారు. అయితే ఈ సమయంలో తమ పిల్లల జీవితాల్లో అతిగా జోక్యం చేసుకుంటారు. నిత్యం వారు ఏం చేస్తున్నారు? ఎటు వెళ్తున్నారు? ఇలా ప్రతీ అంశాన్ని మానిటరింగ్ చేస్తుంటారు. దీనినే వైద్య భాషలో హెలికాప్టర్‌ పేరెంటింగ్ అంటారని నిపుణులు అంటున్నారు. దీనివల్ల పిల్లలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయంలో తల్లిదండ్రులే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అలా కాకుండా వారితో ఫ్రెండ్లీగా ఉంటూనే వారికి ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాలు అర్థమయ్యేలా వివరించాలి. పెద్దవారితో ఎలా మాట్లాడాలి. వారిని ఎలా గౌరవించాలో తెలియచెప్పాలి.

వారికీ స్వేచ్ఛని ఇవ్వాలి

చిన్నారులకు ఏది మంచిదో, ఏదో చెడో వాల్లే ఓ నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని చిన్నారులపై బలవంతంగా రుద్దుతారు. చిన్నారులు చేసే ప్రతీ పనిని గమనిస్తూ అలా కాదు, ఇలా అంటూ చెబుతుంటారు. అయితే నిజానికి ఇది మంచే అయినా దీర్ఘకాలంలో మాత్రం కొన్ని సమస్యలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఆలోచన శక్తి తగ్గుతుంది. సొంతం నిర్ణయాలు తీసుకోలేకపోతారు.హెలికాప్టర్‌ పేరెంటింగ్‌ కారణంగా చిన్నారులు ఆత్మన్యూనత భావానికి గురవుతారు. వారిలో ఆత్మవిశ్వాసం కోల్పోతారు. సమస్యల పరిష్కారానికి సొంతగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. దీంతో పిల్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రతీ విషయంలో చిన్నారుల వెంట పడకుండా వారికీ కాస్త స్వేచ్ఛను ఇచ్చి, సొంతం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు నిపుణులు.

Share post:

లేటెస్ట్