వాకింగ్‌ చేస్తున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్

Mana Enadu: ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది ‘వాకింగ్’. రోజూ అరగంట పాటు కొంచెం వేగంగా నడిస్తే అది మనకు మేలు చేస్తుంది. కొందరు బరువు తగ్గాలని వాకింగ్ మొదలు పెడతారు. కానీ బరువు తగ్గడం లేదని చివరకు పక్కన పెడతారు. అలాంటి వారు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.


☛ నడిచేటప్పుడు చేతులను బలంగా, వేగంగా ముందుకు, వెనక్కు ఊపుతూ నడవాలి. దీని వల్ల కేలరీలు బర్న్ అవ్వడంతో పాటు గుండె ఆరోగ్యం బాగుంటుంది.
☛ మనం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక నిమిషం వేగంగా నడిచి తర్వాత 2 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. మళ్లీ ఒక నిమిషం స్పీడ్ వాకింగ్ మళ్లీ 2 నిమిషాలు స్లో వాకింగ్.. ఇలా చేయడం వల్ల కేలరీలు బర్న్ అయ్యి ఫిట్‌నెస్ మెరుగవుతుంది.
☛ అవకాశం ఉండి సౌకర్యంగా ఉంటే చదునుగా ఉండే నేలపై నడిచే కంటే కొండ ప్రాంతంలా ఉన్న ప్రదేశంలో నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

కేలరీలు ఎక్కువ బర్న్ అవ్వాలంటే..

☛ వాకింగ్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందాలి అనుకునేవారు కొంచెం బరువుగా ఉండే వస్తువులను పట్టుకొని నడవాలి. దీని వల్ల కేలరీలు ఎక్కువ బర్న్ అవడంతో పాటు కండరాలు బలంగా మారతాయి. అయితే ఎక్కువ బరువున్న వస్తువులు తీసుకెళ్లొద్దు.
☛ వాకింగ్ చేసేటప్పుడు మరీ నెమ్మదిగా కాకుండా కాస్త వేగంగా నడవడం ఉత్తమం. అలాగని మరీ వేగంగా వద్దు. దీని వల్ల అలసటతో పాటు కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
☛ వాకింగ్ చేసేటప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. అందుకే వాకింగ్‌కు కొన్ని నిమిషాల ముందు, పూర్తైన కొన్ని నిమిషాల తర్వాత నీరు తాగాలి. మధ్య మధ్యలో దాహంగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకొని కొద్దిగా నీరు తాగి మళ్లీ ప్రారంభించాలి.
☛ వాకింగ్ చేసేటప్పుడు సౌకర్యంగా ఉండే షూస్ ధరించాలి. మరీ టైట్‌గా ఉంటే గాయాలు కావడం, మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
☛ వాకింగ్ చేసేటప్పుడు రోజూ మీరు నడిచిన సమయంలో ఎన్ని అడుగులు వేశారో లెక్కపెట్టండి. దీని వల్ల తర్వాతి రోజు అంతకంటే ఎక్కువ వేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా మీ వాకింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు.

 బిర్యానీ అంటే ఇష్టమైనా అతిగా వద్దు

మాంసాహారం తినేవారిలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేది ‘బిర్యానీ’. కొందరు వారంలో ఒకసారైనా మరికొందరు వారంలో 4,5 సార్లైనా బిర్యానీ తింటుంటారు. దీని రుచి వారిని అంతలా ఆకర్షిస్తుంది. అయితే బిర్యానీని అతిగా తినడం మంచిగి కాదని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి కారణం కొన్ని హోటళ్లలో బిర్యానీ తయారీకి ఉపయోగించే నాణ్యత లేని నూనెలు, రంగులు, అతిగా వాడే మసాలాలు, చికెన్. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో చాలా హోటళ్లలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

 బిర్యానీ అతిగా తింటే?

☛ ఇంట్లో వంట కోసం వాడే నూనె కన్నా అధికంగా హోటళ్లలో బిర్యానీ తయారీకి వాడతారు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. ఇలాగే బిర్యానీలోని చికెన్, మటన్ ముక్కలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
☛ కొన్ని హోటళ్లలో బిర్యానీ తయారీకి నాణ్యత లేని నూనెలను వాడుతున్నారు. వీటి వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది.
☛ బిర్యానీ తయారీలో మసాలాలు అధికంగా వాడతారు. ఇది ఇంట్లో వాడేదానికంటే 2, 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే దానికి అంత రుచి వస్తుంది. దీన్ని అతిగా తింటే ఈ మసాలాల వల్ల అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Heart Attack: గుండెపోటుకి ముందు కనిపించే సంకేతాలివే! వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత టెక్ యుగంలో గుండెపోటు(Heart Attack) అనేది వృద్ధులకే కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు(Eating habits), వ్యాయామం(Exercise) చేయకపోవడం, పని ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనూ గుండె సమస్యలు(Heart Problems) వస్తున్నాయి. చాలా మంది వ్యాధి వచ్చేలోపు గుర్తించలేక చివరికి ప్రాణాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *